తల్లి లాంటి కాంగ్రెస్ పై పెద్దిరెడ్డి విమర్శలా?
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పోటుగారి భాస్కర్.
"కాంగ్రెస్ శవాన్ని మోస్తున్న ఆ నలుగురు " అన్న మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు అక్షేపణీయం అని చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ పెద్దిరెడ్డి లాంటి ఎంతో మంది కి రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని అయన గుర్తు చేసారు. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి, పదవి కోసం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ప్రమాద మరణాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చింది మీరు కాదా? అని పోటుగారి భాస్కర్ గుర్తు చేసారు.
పెద్దిరెడ్డి గారూ..మీరు కాంగ్రెస్ పార్టీ లో ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి ఈ రోజు షర్మిల రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికను జీర్ణించు కోలేకుండా మతి బ్రమించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. "తల్లి పాలు తాగి తల్లి రోమ్మే గుద్దే "సంస్కృతి మంచిది కాదని పోటుగారి భాస్కర్ హితవు పలికారు. పెద్దిరెడ్డి కాంగ్రెస్ పై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. మీ పార్టీ లో వున్న శాససభ్యుల పనితీరుకు మీరే ఫెయిల్ మార్కులు వేసి మీ ఓటమిని మీరే అంగీకారిస్తున్నారే ఇక ఇతర పార్టీల పై విమర్శలెందుకు అని ఏద్దేవా చేసారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అదేవిధంగా మీరు కాంగ్రెస్ పార్టీకి చేసిన ద్రోహన్ని ప్రజలందరూ గమనిస్తూనేవున్నారన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో లో మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.షర్మిలరెడ్డి అడిగే సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలాంటి విమర్శలా? ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని, విమర్శలు మానుకోండి. భేషరతుగా కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పండి అని పోటుగారి భాస్కర్ మంత్రి పెద్దిరెడ్డికి హితవు పలికారు.