8, ఫిబ్రవరి 2024, గురువారం

మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచాలని ధర్నా



మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని ఏ ఐ టీ యు సీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, ఏ ఐ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు ప్రభుత్వంను హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజనం వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధం రాష్ట్ర సమితి పిలుపు   చిత్తూరు డి ఈ వో కార్యాలయం దగ్గర గురువారం మధ్యాహ్నం భోజనం జిల్లా నాయకురాలు జయలక్ష్మి పరిమళ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేయు వంట కార్మికులకు ప్రభుత్వాలు మారినా మహిళా కార్మికుల తలరాత మారలేదు, పాఠశాలలో వంట చేసే కార్మికులకు కనీసం వేతనాలు అమలు పరచడం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రోజురోజుకు ధరలు పెరుగుతున్నప్పటికీ పిల్లలకు ఇచ్చే హెల్మెట్రీ స్కూల్ పిల్లలకు 15 రూపాయలు హైస్కూల్ పిల్లలకి ₹20 పెంచాలని, మధ్యాహ్నం భోజన కార్మికుల వేతనాలు పెంచాలి, స్కూల్లో మాలిక వసతులు ఏర్పాటు చేసి గ్యాస్ సిలిండర్లో ప్రభుత్వమే సప్లై చేయాలని డిమాండ్ చేశారు.


మధ్యాహ్నం భోజన కార్మికులు గుర్తింపు కార్డులు ఇచ్చి యూనిఫామ్ సౌకర్యం కల్పించాలని కార్మికుల కష్టాలను గుర్తించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విపల మవుతున్నది, మహిళా కార్మికులకు తోడుగా ఉంటానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు వారిని నట్టేట ముంచిందన్నారు. మహిళా కార్మికులు సమస్యలు పరిష్కరించుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని,  భవిషతులో ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. కార్మికులు చేయు పోరాటాలకు ఏ ఐ టి యు సి  పూర్తి నాయకత్వం వహిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు, అంగన్వాడీ రాష్ట్ర వాక్యం ప్రెసిడెంట్ ప్రేమ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ నగర్ కార్యదర్శి వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరిచంద్ర,రమాదేవి భోజనం వర్కర్స్ నాయకులు జయలక్ష్మి, మణి మేఘల, లక్ష్మి, ప్రభావతి, సుజాత  తదితరులు పాల్గొన్నరు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *