4, ఫిబ్రవరి 2024, ఆదివారం

క్రీడామైదానాన్ని పరిరక్షించాలి


ఎస్వీ హై స్కూల్ పూర్వవిద్యార్థులు,  రాజకీయ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ధర్నా


ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ  శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో ఎస్వి హై స్కూల్ క్రీడా మైదానం ముందు ఆదివారం ధర్నా కార్యక్రమం నిర్వచాహించారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయపార్టీ నాయకులు, క్రీడాకారులు హాజరైనారు. ధర్నాకు పోలీసులు అడ్డుచెప్పడంతో క్రీడామైదానం గేటు ముందు నిలబడే ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 134 ఏళ్ళ చరిత్ర కల్గిన క్రీడా మైదానాన్ని కేవలం  వసతిగృహం కోసం నిర్మించడం దారుణమని, ఎంతోమంది పేద క్రీడాకారులు ఈ మైదానంలోనే క్రీడలు అభ్యసించి ప్రస్తుతం ఉన్నత స్థితి లో ఉన్నట్లు గుర్తుచేశారు. ప్రభుత్వం క్రీడల కోసం ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో కోట్ల రూపాయిలను వెచ్చించి క్రీడామైదానాలను అభివృద్ధి చేస్తుంటే తిరుపతిలో మాత్రం యేళ్ళనాటి మైదానాన్ని వేరొక అవసరాలకోసం ఉపయోగించడం దారుణమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను విరమించుకోకపోతే అన్ని విద్యార్ధి సంఘాలతో , అన్ని రాజకీయ పార్టీలతో , ప్రముఖులతో ఏకమై పెద్దఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. తరువాత క్రీడామైదానం నందలి నిర్మాణ పనులను పర్యవేక్షణ చేసారు.

 ఈ కార్యక్రమానికి తెలుగుదేశం నుంచి ఊక విజయకుమార్, ఆర్ సి మునికృష్ణ, బీజేపీ నుంచి భానుప్రకాష్ రెడ్డి, పొనగంటి భాస్కర్ , వరప్రసాద్, బిఆర్ఎస్ నుంచి ఆర్కాట్ కృష్ణప్రసాద్, జనసేన నుంచి హేమ కుమార్, కొండా రాజమోహన్ , కాంగ్రెస్ నుంచి నారాయణస్వామి, ఆమ్ ఆద్మీ నుంచి నగేష్, రాజేష్ పూర్వ విద్యార్థులు బై ఎన్ సేవ్ మధు , రమేష్ , లక్ష్మీనారాయణ , పురుషోత్తం , తులసీరామ్ రెడ్డి, రాఘవేంద్ర , జీవన్ , బాల సుబ్రహ్మణ్యం, అబ్దుల్లా , రఫీ , ఎస్వీయూ విద్యార్ధి నేత శివశంకర్ నాయక్  తదితరులు పాల్గొన్నారు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *