అంగన్వాడీ పోరాటం అమోఘం
అభినందన సభలో వాడ గంగరాజు
అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కోసం 42 రోజులు చేపట్టిన సమ్మెలో ప్రభుత్వం అనేక నిర్బంధాలు గురిచేసిన చివరివరకు పోరాటం కొనసాగడంతో ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కారానికి ఒప్పందంతో ఈ పోరాటం ఒక చారిత్రక విజయమని ఆదివారం కుప్పం ప్రాజెక్టులో జరిగిన అభినందన సభలో యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు కొనియాడారు. ప్రాజెక్టు సీనియర్ నాయకులు ప్రమీల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు లలిత యూనియన్ గౌరవాధ్యక్షుడు గంగరాజు మాట్లాడుతూ 42 రోజుల సమ్మె కాలంలో ప్రభుత్వం సెంటర్ తాళాలు పగలగొట్టిన, ఎస్మా ప్రయోగించిన, షోకాజ్ నోటీసులు ఇచ్చిన, టెర్మినేషన్ చేసిన ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా యూనియన్ ఇచ్చిన పిలుపుని జయప్రదం చేయడం అభినందనీయమని కొనియాడారు.
చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో సమరశీల పోరాటం చేసి అనేక మందికి దెబ్బలు తగిలినప్పటికీ గేట్లు తోసుకొని లోపలికి వెళ్ళిన చరిత్ర అంగన్వాడీ లదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేసిన పోరాటం దేశంలో ఉన్న కార్మికులకు ,ఉద్యోగులకు దశా దిశా నిర్దేశించే పోరాటంగా నిలిచిందన్నారు. ప్రాణత్యాగం కి సిద్ధపడి పోరాటం చేయడంతో ప్రభుత్వం దిగరాక తప్పలేదని తెలిపారు. ప్రధానమైన వేతనాల పెంపు మినీ సెంటర్ ను మెయిన్ సెంటర్లకు మార్చడంలో ప్రభుత్వం రాష్ట్ర పూర్వకంగా అగ్రిమెంట్ కు మన పోరాటంతో ప్రభుత్వ మెడల వంచడం సాధ్యమైంది అన్నారు. మరి ఇలాంటి విజయం సాధించిన తర్వాత కూడా మన పోరాటాన్ని అబద్ధపు ప్రచారంతో కొంతమంది కొన్ని యూనియన్లు ప్రయత్నాలు చేస్తున్నాయని వాటిని త్రిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.అరచేత్తో సూర్యకాంతం ఆపడం ఎంత అబద్దమో వేయడం కూడా అంతే అబద్ధమని తెలిపారు . పోరాటం లో కుప్పం ప్రాజెక్టు ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కీలక పాత్ర పోషించడానికి జిల్లా కమిటీ నుంచి అభినందించడం జరిగింది .ఈ సమ్మె సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 13 మంది అంగన్వాడీలు చనిపోయిన వారికి నివాళులర్పించడం జరిగింది .అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
నూతన కమిటీ ఎన్నిక
కుప్పం ప్రాజెక్టు కార్యదర్శి సరళ అధ్యక్షురాలు అనిత, గౌరవ అధ్యక్షురాలు ప్రమీల ఇంకా 18 మందితో కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సభలో సిఐటియు నాయకులు డేవిడ్ కుమార్ యాదవ్ తోపాటు అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు