17, ఫిబ్రవరి 2024, శనివారం

తిరుపతి టిడిపిలో తీవ్రమైన వర్గ పోరు





తిరుపతి టిడిపిలో వర్గ పోరు తీవ్ర స్థాయికి చేరింది. నియోజక వర్గం ఇంచార్జి మున్నూరు సుగుణమ్మ, పార్లమెంటు అధ్యక్షుడు జి నరసింహ యాదవ్ ఢీ అంటే ఢీ అనేలా ప్రవర్తిస్తున్నారు. శుక్రవారం రాజధాని ఫైల్స్ సినిమా గూర్చి రెండు వర్గాలు వేరు వేరుగా ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఒకే అంశంపై ఇద్దరు నేతలు విడివిడిగా సమావేశం ఏర్పాటు చేయడం  చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి మధ్యా తొలినుంచి వర్గపోరు కొనసాగుతున్నది. ఇప్పుడు క్లైమాక్స్ కు వచ్చింది. నగరంలోని టిడిపి నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్టు సాధనే లక్ష్యంగా రెండు వర్గాలుగా విడిపోయి ఆధిపత్యం నిరూపించుకోవడానికి పోటీ పడుతున్నారు. అయితే ఈ ఆధిపత్య పోరు కారణంగా పార్టీ ఎక్కడ నష్టపోవాల్చి వస్తుందోనని పార్టీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలే తిరుపతి సిటు మీద జనసేన, బీజేపీ కన్ను వేశాయి. ఇరు పార్టీలు తిరుపతి కోసం పోటీ పడుతున్నారు. కావున పార్టీ అంతర్గత కుమ్ములాటల కారణంగా చంద్రబాబు ఈ సీటును జనసేన లేక బీజేపీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. అల్ జరిగితే పార్టీకి అపార నష్టం జరుగుతుందని భయపడుతున్నారు.

సుగుణమ్మ గత ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి చేతిలో కేవలం 708 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాబట్టి ఈ ఎన్నికల్లో టికెట్టు వస్తే సులభంగా గెలుస్తానని అంటున్నారు. అయితే మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఆమె మనవరాలు కీర్తన కార్పొరేటర్ గా పోటీ చేసి ఓడిపోయారు. దీనితో ఆమె సమర్ధతపై అధిష్టానానికి అనుమానం వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె సామాజిక వర్గానికి చెందిన ఊకా విజయకుమార్, కోడూరు బాలసుబ్రమణ్యం, జె బి శ్రీనివాస్ తదితరులు ఆమెను కాదని టికెట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీరికి నరసింహ యాదవ్ మద్దతు ఇస్తున్నారు. 

కాగా పార్టీ ఏర్పడినప్పటి నుంచి పార్టీకి సేవలు చేస్తున్న తనకు టికెట్టు ఇవ్వాలని నరసింహ యాదవ్ పట్టు పడుతున్నారు. సుగుణమ్మ వ్యతిరేకులు ఆయనకు మద్దతు ఇస్తున్నారు.  2019 ఎన్నికల సమయంలో కూడా నరసింహ యాదవ్ టికెట్టు కోసం ప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఇప్పుడు టికెట్టు ఇస్తే గెలుస్తానని అంటున్నారు. అయితే తన కుటుంబ సభ్యులను ఇద్దరినీ కార్పొరేటర్ లుగా పోటీ పెట్టి వారిని గెలిపించుకోలేక, ఘోరంగా ఓడిపోయారు. దీనితో ఆయన పైన  కూడా చంద్రబాబుకు నమ్మకం కలగడం లేదంటున్నారు. 

ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉండగా పొత్తులో భాగంగా తిరుపతి స్థానం కోసం బిజెపి, జనసేన పట్టు పట్టే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆ పార్టీలలో ఒకరికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బిజెపి టికెట్టు కోసం భానుప్రకాష్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. జనసేన టికెట్టును డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *