16 న భారత్ బంద్
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు పిలుపు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆలంబిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ 16న జరిగే భారత్ బంద్ జయప్రదం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు, జిల్లా నాయకులు సురేంద్రన్ ,సీనియర్ నాయకులు పి. చైతన్యలు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ప్రజలను సమస్యలు పట్టించుకోకుండా తప్పుదారి పట్టిస్తున్నదని విమర్శించారు. అన్ని రకాల ప్రజలు వ్యాపారస్తులు, సామాన్య ప్రజానీకం రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువత ,మహిళలు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని వీరి గురించి పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కట్టబెడుతున్నదని ద్వజమెత్తారు. చిత్తూరు నగరంలో కూడా అనేక రకాల ప్రజా సమస్యలు ఉన్నాయని ఆ ప్రజా సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాటం చేస్తుందని ప్రజలు వ్యాపారస్తులు సిపిఎం ను ఆదరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రాష్ట్రంలో కార్మికులకు ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీని బలోపేతానికి అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు లోకయ్య, చిట్టెమ్మ, అర్జున్, ప్రసాద్,దాము, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.