జీతాల కోసం పంచాయతీ కార్మికుల ధర్నా
గ్రామపంచాయతీలో పనిచేయు గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్లో ఉన్న జీతాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చిన జిల్లా అధికార యంత్రాంగం హామీని నిలబెట్టుకోవాలని ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి కోదండయ్య, ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు యస్. నాగరాజు డిమాండ్ చేశారు. పెండింగ్ జీతాలు వేయాలని కోరుతూ ఈరోజు గ్రీన్ అంబాసిడర్ కార్మికులు జడ్పీ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాసరి చంద్ర అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా కోదండ, నాగరాజు లు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ పనులు చేస్తున్న గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు సుమారు 20 నుంచి 25 నెలలు జీతాలు పెండింగ్లో ఉంటే ఆ కుటుంబాలు ఏ విధంగా బతకాలని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా గ్రామపంచాయతీలో పనిచేయు గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్లో ఉన్న 15నెల నుండి 25 నెల జీతాలు ఇప్పించాలని గత సంవత్సరం కాలంగా జిల్లా అధికార యంత్రాలను దృష్టికి తీసుకెళ్లిన ఎంతవరకు జీతాలు వేయలేదన్నారు. సంక్రాంతికి ఆరు నెలలు జీతాలు వేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటివరకు కనీసం జీతం అయింది వేయలేదన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షపాతీ మహిళా కార్మికులగా అండగా ఉంటానని చెప్పి కనీసం పంచాయతీ కార్మికులకు జీతాలు ఇప్పించడంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నదన్నారు. అడిగిన ప్రతిసారి అధికారులు మీరు వెళ్ళండి, రెండు నెలల జీతం వేస్తామని కార్మికులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
మరి 25 నెలలు పెండింగ్ జీతాలు ఉంటే ఆ కుటుంబాలు పోషణ పిల్లలు చదువులు ఏ విధంగా భరించాలని ప్రభుత్వాన్ని, జిల్లా అధికార యంత్రంగాన్ని నిలదీచారు. ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి జీతాలు చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తీసుకొచ్చిన 680 జీవో ప్రకారం 10000 జీతం ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇంతవరకు అమలు చేయలేదన్నారు. కావున ప్రభుత్వం చెప్పిన ఆమెని నెరవేర్చాలని, కార్మికులకు జీతాలు అడిగితే ఉద్యోగం నుంచి తొలిచే విధానానికి స్వస్తి పలకాలనీ, తొలగించిన కార్మికులను తిరిగి పనిలో పెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం సీఈవో కార్యాలయంలో జిల్లా కో ఆర్డినేటర్ షణ్ముగంకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన కార్మికుల అందరి పేర్లు సిస్టంలో లేదని, కొంతమంది పేర్లు ఉన్నాయని అందరి పేర్లు రెండు రోజుల్లో ఆన్లైన్లో పెట్టిచ్చి జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి మండలంలో ఉన్న ఈ ఆర్ డి వో లు గ్రీన్ అమ్మ సర్ కార్మికులను ఆన్లైన్లో పెట్టాలని కోరామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజు నగర కార్యదర్శి చంద్రగిరి, అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గోయింగ్ స్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి, గ్రీన్ అంబాసిడర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేంద్ర ఏసు పాదం, కృష్ణయ్య, చెంచురామయ్య, కుమారి, రేణుక, రవి చంద్రబాబు, కార్మికుల పాల్గొన్నారు.