సి కె బాబుతో టిడిపి ఎమ్మెల్సీ మంతనాలు..!
చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సి కె బాబుతో టిడిపి ఎమ్మెల్సీ, రీజనల్ కోఆర్డినేటర్ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి రహస్య మంతనాలు జరిపినట్లు తెలిసింది. ఆయన శుక్రవారం రాత్రి సి కె దంపతులను వారి నివాసంలో కలిశారు. మంగళవారం జి డి నెల్లూరులో జరుగనున్న రా కదలి రా సభకు ఆహ్వానించారు. అయితే తమకు టికెట్టు హామీ ఇస్తేనే వస్తామని సి కె దంపతులు చెప్పారని సమాచారం. పూర్తివివరాలు బయటికి రాలేదు.