జిల్లా అడిషనల్ ఎస్.పి.గా ఆరిఫుల్ల
చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్.పి, అడ్మినిస్ట్రేషన్ గా ఆరిఫుల్ల భాద్యతలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా 27 వ అడిషనల్ ఎస్.పి, అడ్మినిస్ట్రేషన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లా ఎస్పీ పి.జాషువాను పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్. ఐ గా నియమితులైన ఆరిఫుల్ల రాయలసీమ జిల్లా లో పని చేసి సి.ఐ గా పదోన్నతి పొంది కర్నూల్, అనంతపురం లో పని చేశారు. డి.ఎస్పీ గా పదోన్నతి పొంది పలమనేరులో డి.ఎస్పీగా చేస్తూ అడిషనల్ ఎస్పీ ప్రమోషన్ పొంది తిరుపతి జిల్లా OSD గా, వైజాగ్ లో ట్రాఫిక్ డి.సి.పి. గా పనిచేశారు. సాధారణ బదిలిలో చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా వచ్చారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా పోలీస్ అధికారులు, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ అధికారులు, ఏ.ఆర్. అధికారులు జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది మర్యాదపూర్వకంగా అడిషనల్ ఎస్.పి.ని కలిసి అభినందించారు.