6, ఫిబ్రవరి 2024, మంగళవారం

జీడీ నెల్లూరు టీడీపీ అభ్యర్థిగా థామస్




రానున్న ఎన్నికలలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో డాక్టర్ VM థామస్ కు టికెట్ ఖరారు కానుంది. మంగళవారం గంగాధర నెల్లూరులో జరిగిన 'రా కదలిరా' బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత థామస్ ను పొగడ్తలతో ముంచేత్తారు. ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. థామస్ లాంటి మంచి వ్యక్తి ప్రజా ప్రతినిధిగా ఉండాలని ఆకాంక్షించారు. బయోటెక్నాలజీ చేసిన థామస్ టెస్ట్ ట్యూబ్ బేబీ విషయంలో పరిశోధనలు చేసీ, విజయం సాధించారని కొనియాడారు. పలు దేశాలలో పర్యటించి టెస్ట్ ట్యూబ్ బేబీ విషయంలో అధ్యయనం చేశారన్నారు. థామస్ ను మట్టిలో మాణిక్యంగా వర్ణించారు.


నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన థామస్ స్వయం శక్తితో ఎదిగారని చంద్రబాబు అన్నారు. అటువంటి థామస్ ను  నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండాల్సిందిగా కోరానన్నారు. నియోజకవర్గంలో థామస్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు. ఆయన లాంటివాళ్ళు ప్రజా ప్రతినిధిగా ఉండాలని ఆకాంక్షించారు. టిడిపి, జనసేన పొత్తు కారణంగా అభ్యర్థులను ప్రకటించడం లేదన్నారు. 

చంద్రబాబు నాయుడు ప్రసంగం విన్న రాజకీయ పరిశీలకులు గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి థామస్ కు  టికెట్టు ఖరారైందని అంటున్నారు. జనసేన, టిడిపి పొత్తులో భాగంగా బహిరంగ సభలో ప్రకటించడం కుదరలేదని భావిస్తున్నారు. వేదిక మీద ఆరు నియోజకవర్గాలకు చెందిన నాయకులు, ఇన్చార్జులు ఉన్నారు. వారిని ఎవరిని పట్టించుకోకుండా, చంద్రబాబు థామస్ ఒక్కరినే పొగడ్తలతో ముంచెత్తారు. కావున మొదటి జాబితాలోనే గంగాధర నెల్లూరు అభ్యర్థిగా థామస్ పేరు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *