5, ఫిబ్రవరి 2024, సోమవారం

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే గాంధీ రాజీనామా



వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు గౌరవం లేదని మాజీ ఎమ్మెల్యే ఆర్. గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. గడిచిన 12 సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతున్న  ముఖ్యమంత్రి జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని అన్నారు. జిల్లాలో దళితుల పట్ల అణిచివేత ధోరణిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరిస్తున్నారని, ఆయన ఆధిపత్యం  కొనసాగుతోందన్నారు.


జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్లు లేకుండా చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించారు. రామచంద్రారెడ్డి తీరును సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మాటల్లో తేటతెల్లం అయ్యిందన్నారు.బడుగు బలహీన వర్గాలను బానిసలుగా చూస్తున్న వైసీపీ పార్టీలో ఇమడలేక  ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో జరగబోయే రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి పార్టీలో చేరబోతున్నట్లు మాజీ ఎమ్మెల్యే ఆర్ గాంధీ తెలిపారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *