విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రచారం చేయండి
చేతి వృత్తులు వారి వృత్తి నైపుణ్యత మరింత మెరుగు పరచడానికి, ఆర్థికంగా ఉపయోగపడేలా దేశ వ్యాప్తంగా పి.ఏం. విశ్వకర్మ యోజన పథకాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన పథకానికి ప్రచారం కల్పించాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందచేశారు.
దీని ద్వారా శిక్షణ కల్పించి తక్కువ వడ్డీతో నేరుగా లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయబడుతుందన్నారు. కాని మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేలా నేటికి పూర్తిగా దానిపై దృష్టి సారించిన పోవడాన్ని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తీవ్రంగా ఖండించారు. వెంటనే అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షన్మోహన్ ను కోరారు. వినతి పత్రాన్ని అందజేసిన వారిలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఓబీసీ జిల్లా ఇన్చార్జి అట్లూరి శ్రీనివాసులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇ.సుధాకర్, సెంట్రల్ మండల అధ్యక్షులు షణ్ముగం,ఓబీసీ నాయకులు ఆనంద్ పాల్గొన్నారు.