కౌండిన్య నదిలో గుర్తుతెలియని శవం
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం కేటిల్ ఫారం, ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఉన్న కౌండిన్య నదిలో, సోమవారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు నీటిపై మగ వ్యక్తి శవం తేలియాడుతుండడంతో భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించారు. ఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి శవంగా గుర్తించారు. ఆత్మహత్య లేదా ఎవరైనా హత్య చేసి పడవేసి వెళ్లారా, వివరాలు సేకరిస్తున్నారు దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు పోలీసులు.