13, డిసెంబర్ 2023, బుధవారం

తెదేపా, జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా DK శ్రీనివాస్ ?



 చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం, పార్టీ జనసేన రాజకీయ ముఖచిత్రం మారుతుంది. DK ఆదికేశవులు కుమారుడు DA శ్రీనివాస్ రానున్న ఎన్నికలలో చిత్తూరు అసెంబ్లీ స్థానం నుండి పోటి చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సమాచారం. మంగళవారం చిత్తూరుకు చెందిన బలిజ కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలు కొంతమంది బెంగళూరులోని డీకే ఆదికేశవులు నాయుడు కుమారుడు డి ఎ శ్రీనివాసులు కలిశారు. తనను రాజకీయాల్లోకి రావలసిందిగా ఆహ్వానించారు. ఇదివరకు తండ్రి ఆదికేశవులు, తల్లి సత్యప్రభ తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజలకు సేవ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వారి బాటలోనే డిఏ శ్రీనివాస్ కూడా ప్రయాణించాలని కోరారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆలస్యం చేయకుండా తన మనసులోని మాటను బయట పెట్టాల్సిందిగా కోరారు.



ఇందుకు డి ఎ శ్రీనివాస్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తాను చిత్తూరు నియోజకవర్గ నుంచి రానున్న ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని శ్రీనివాసుని కలిసిన బలిజ సంఘం నేతలు చెప్పారు. రెండు మూడు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును, జనసేనని పవన్ కళ్యాణ్ ని కలిసి, చిత్తూరుకు వస్తానని అన్నట్లు తెలిసింది. వారి ఇరువురి మనోగతం ఆధారంగా ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే విషయాన్ని నిర్ణయిస్తామని అన్నట్లు సమాచారం. తన తండ్రికి తల్లికి తోడ్పాటు అందించిన విధంగానే తనకు కూడా  సహకరించాలని కోరినట్లు సమాచారం. దీంతో దిగే శ్రీనివాస్ రాజకీయ రంగ అరగ్రేటం మీద సస్పెన్స్ వీడినట్లయ్యింది. 


గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఏఎస్ మనోహర్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి చిత్తూరు నియోజకవర్గ ఇంచార్జ్ పదవి ఖాళీగా ఉంది. ఇప్పటివరకు ఎవరిని నియమించలేదు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ, చిత్తూరు పట్టణ అధ్యక్షురాలు కటారి హేమలతల  ఆధ్వర్యంలో కార్యక్రమాలు నడుస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నియోజకవర్గ బాధ్యతలను తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు. ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ తరఫున బలిజ సామాజిక వర్గం నుంచి కాజూరు బాలాజీ, కటారి హేమలత టిక్కెట్ ని ఆశిస్తున్నారు. అలాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి సీకే బాబు, కమ్మ సామాజిక వర్గం నుంచి  గురజాల జగన్మోహన్ నాయుడు, చంద్ర ప్రకాష్, ఎన్పీ జయప్రకాష్  టికెట్ రేసులో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటివరకు ఎవరికి హామీ ఇవ్వలేదు.


తెలుగుదేశం పార్టీ నాయకులు  ఆదికేశవులు నాయుడు కుటుంబ సభ్యుల కోసం వేచి ఉన్నట్లు సమాచారం. అయితే డి ఏ శ్రీనివాస్ మాత్రం ఇప్పటివరకు తాను రాజకీయాల్లోకి ఉన్నది, లేనిది తేల్చి చెప్పలేదు. ఆయనకు తెలుగుదేశం, జనసేన పార్టీల నుండే కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆహ్వానం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరు తనను కలిసిన తన కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించుకుని ఏ విషయం చెప్తానని దాటవేస్తూ వచ్చారు. అయితే మంగళవారం కొంతమంది బలిజ సంఘం నేతలు కాజూరు బాలాజీ,  పూల చందు కుమార్, ఓ యం దాసు, విశ్వనాథ్, మురళి తదితరులు శ్రీనివాసులు కలిసి రాజకీయ రంగ ప్రవేశం గురించి చర్చించారు. అయన  సుముఖత వ్యక్తం చేయడంతో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి  దిగుతున్నట్లు స్పష్టం అవుతుంది. అయితే ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *