ప్రజలు ఇండ్ల నుండి బయటకి రావద్దు: జిల్లా కలెక్టర్
జిల్లాలో ఎలాంటి నష్టం జరగలేదు.
కంట్రోల్ రూమ్ నెంబర్లు: 9491077356 - 08572 242777.
జిల్లాలో మిచాంగ్ తుఫాన్ దృష్ట్యా జిల్లా ప్రజలు రెండు రోజుల పాటు ఇళ్ల నుండి బయటకు రావద్దని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ కోరారు.జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో మిచాంగ్ తుఫాన్ వల్ల ఎలాంటి నష్టం జరగలేదన్నారు. చిత్తూరు జిల్లా పరంగా మిచాంగ్ తుఫాన్ కు సంబంధించి మొత్తం కంప్లీట్ గా అడ్మినిస్ట్రేషన్ సంబంధించి రెవెన్యూ, పోలీస్, పౌర సరాఫరాల శాఖ వైపు నుంచి చేయవలసిన అన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం జిల్లాలోని తహశీల్దార్లు ఎంపీడీవోలతో సమావేశం నిర్వహించడం జరిగిందని, మండల స్థాయి అధికారులతో పాటు రెవెన్యూ సిబ్బంది అందురు ఫిల్డ్ పై అందుబాటులో ఉండాలని, ఏదైనా నష్టం జరిగితే వెంటనే జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన, కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలన్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు 9491077356 - 08572 242777.
ఇప్పటివరకు జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదన్నారు. వర్షం 50 నుండి 55 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు జరిగిందని, నగరి నియోజకవర్గం లో రోడ్లపైకి నీరు రావడం జరిగింది తప్ప, రోడ్లు గాని పంట పొలాలు గాని నష్టం జరగలేదని తెలిపారు. పౌర సరాఫరా శాఖ ద్వారా ఒక్కటవ తేదీని రేషన్ స్టాక్ పోయింట్లో అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి, ప్రజలకు రేషన్ అందజేయుటకు సిద్ధంగా ఉందని తెలిపారు. నగిరి నియోజక వర్గానికి సంబంధించి నగిరి, నగరి మున్సిపాలిటీ, నిండ్ర, విజయపురం, కార్వేటి నగర్ మండలాలలో పాఠశాలలకు సెలవు ఇవ్వడం జరిగిందన్నారు. మిగిలిన చోట్ల ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రజలు వర్షం లో వాగులు, వంకలు వద్దకు వెళ్లరాదని ప్రజలకు చూచించారు.