26, డిసెంబర్ 2023, మంగళవారం

జిడి నెల్లూరు వైసీపీ టిక్కెట్టుకు త్రిముఖ పోటీ


గంగాధర నెల్లూరు (ఎస్సీ) నియోజకవర్గ వైసిపి టికెట్టు కోసం పోటీ పెరిగుతోంది. కొత్త ముఖాలు తెర మీదికి వస్తున్నాయి.  
ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణ స్వామి తన కుమార్తె కృపాలక్ష్మికి టిక్కెట్టు ఇప్పించుకోవడానికి  ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఒక దశలో మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ అక్క కుమారుడు నుకతోటి రాజేష్ పేరు ఖరారు అయినట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ పేరు తెర మీదికి వచ్చింది.



ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణ స్వామికి ఈ సారి టికెట్టు రాదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనకు తిరుపతి పార్లమెంటు లేదా సత్యవేడు టికెట్టు ఇస్తారని ఒక వర్గం ప్రచారం చేస్తున్నది. నారాయణ స్వామి మాత్రం తనకు ఎలాంటి ఢోకా లేదని అంటున్నారు. తనకు బదులు తన కుమార్తె కృపాలక్ష్మికి టికెట్టు వస్తుందని తన అనుచరులకు నమ్మకం కలిగిస్తున్నారు. ఆమె కూడా రాజకియాయంగా చురుగ్గా ఉంటున్నారు. ఆమె పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. అమకు పార్టీలోని ప్రముఖులతో పరిచయలు ఉన్నారు. రాజకీయాలలో తండ్రికి సహాయంగా ఉంటున్నారు. 



ఉహించని విధంగా మాజీ మంత్రి గుమ్మడి కుతూహలమ్మ కుమారుడు డాక్టర్ హరికృష్ణ పేరు తెరపైకి వచ్చింది. ఆయన 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన తల్లి కుతూహలమ్మ  వేపంజేరి ఎమ్మెల్యేగా నాలుగు గెలిచారు. జి డి నెల్లూరు నియోజక వర్గం ఏర్పడిన తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తికెట్టుపై గెలిచారు. ఎమ్మెల్యే కాక ముందు చిత్తూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. అయితే 2014 లో జి డి నెల్లూరు నుంచి టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. కొంత కాలం తెదేపా నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేశారు. SC నియోజకవర్గంలో కమ్మ కులానికి చెందిన చిట్టిబాబును సమన్యయకర్తగా నియమించడంతో, అసంతృప్తికి గురైన హరిక్రిష్ణ పార్టీకి రాజీనామా చేశారు. వారి కుటుంబానికి నియోజక వర్గంలో మంచి పేరు ఉన్నందున నారాయణ స్వామి బదులు హరికృష్ణను పోటీ పెడితే మంచి మెజారిటీ వస్తుందని  పార్టీ వర్గాల సర్వేలో వెల్లడైందని అంటున్నారు. సోమవారం హరికృష్ణ ఎస్ ఆర్ పురం మండలం డి కె మర్రిపల్లెలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని 80 కుటుంబాలకు బట్టలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం విశేషం.


కుతూహలమ్మ అక్కకొడుకు రాజేష్ కూడా టికెట్టు రేసులో ఉన్నారు. ఆయనకు పెద్ద నాయకుల మద్దతు ఉన్నప్పటికి నియోజక వర్గంలో బలం లేదంటున్నారు. అతను తెలుగు మాల సామాజిక వర్గం కాబట్టి  అధికంగా  ఉన్న తమిళ వర్గం ఓటర్లు వ్యతిరేకించే ప్రమాదం ఉందని అంటున్నారు. రాజేష్ జెన్ అకాడమి అధ్యక్షుడిగా, జిల్లా జూడో సంఘం చైర్మన్ గా కొనసాగుతున్నారు. ముగ్గరిలో టిక్కెట్టు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్చిందే.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *