11, డిసెంబర్ 2023, సోమవారం

పూతలపట్టు టిక్కెట్టు రేసులో మానవ హక్కుల నేత



పూతలపట్టు రిజర్వు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి మహిళా మానవ హక్కుల సంఘం నేత రమాదేవి ఆసక్తి చెబుతున్నారు. ఆమె ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డిని కలిసి తన మనసులోని మాటను వెల్లడించారు. వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. 


పూతలపట్ట నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఎన్నికకు అభ్యర్థి మార్చుతున్నారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. తొలుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ రవి పోటీ చేసి గెలుపొందారు.  వైఎస్ఆర్సిపి ఆవిర్భవించిన తర్వాత సునీల్ గెలుపొందారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఎమ్మెస్ బాబుకు టికెట్ ఇచ్చారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవలేదు. అలాగే వైఎస్ఆర్సిపి తరఫున ఇప్పటివరకు మహిళా అభ్యర్థికి టిక్కెట్లు ఇవ్వలేదు.


తవణంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణపల్లికి చెందిన రమాదేవి, చిత్తూరు కట్టమంచికి చెందిన హెడ్ కానిస్టేబుల్ వివాహమాడారు. రమాదేవి తండ్రి మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసి పదవి విరమణ చేశారు. తల్లి కూడా నర్సుగా పనిచేశారు. పట్టభద్రురాలు అయిన రమాదేవి గత 15 సంవత్సరాలుగా సామాజిక సేవ చేస్తున్నారు. మహిళ   మానవ హక్కుల సంఘంలో ప్రస్తుతం అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. వీరి కుటుంబానికి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో బందుగణం ఉంది. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన తనకు టికెట్ ఇస్తే 20 వేల మెజార్టీతో గెలుస్తారని రమాదేవి చిత్తూరు న్యూస్ ప్రతినిధికి తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున స్థానికంగా ఉన్న మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదన్నారు. తనాకు టికెట్ ఇస్తే గెలిసి, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీకి పేరు తీసుకొస్తారని హామీ ఇచ్చారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *