పలమనేరు వైసీపీ అభ్యర్థిగా బోస్ ?
పలమనేరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సుభాష్ చంద్రబోస్ పేరును ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పలు బాధ్యతలను నిర్వహించారు. బాలాజీ సూపర్ మార్కెట్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి, అప్పుడు వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అమర్నాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అమర్నాథ్ రెడ్డి తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరడంతో సుభాష్ చంద్రబోస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
పలమనేరు వైసీపీ అభ్యర్థి వెంకటే గౌడ్ మీద పలు ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. పలమనేరు అభ్యర్థిని మార్పు చేయాలని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సుభాష్ చంద్రబోస్ ను వైసిపీ నాయకులు సంప్రదించారు. పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. అందుకు సానుకూలంగా స్పందించిన సుభాష్ చంద్రబోస్ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంటే గౌడ్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయనకు సీఎం సూచించారు. శనివారం పలమనేరులో జరిగిన బస్సు యాత్ర సందర్భంగా బోస్ పార్టీలో చేరారు.
గత ఆదివారం ఆయన ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. అభిమానులు ప్రజలతో చర్చించి వైకాపాలో చేరారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయన గతంలో పలమనేరు మునిసిపల్ చైర్మన్ గా పనిచేశారు. టిడిపి రాష్ట్ర కోశాధికారిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్ధిగా పోటీ చేసిన అమరనాద రెడ్డి చేతిలో కేవలం 2,850 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తరువాత చంద్రబాబు అమరనాద రెడ్డిని పార్టీలో చేర్చుకుని మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్ధిగా పోటీ చేసి వైకాపా అభ్యర్థి వెంకటే గౌడ్ చేతిలో 32,246 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సుభాష్ చంద్రబోస్ కు మంచి వ్యక్తిగా పేరు ఉంది. పట్టణంలో పట్టు ఉంది. ఆర్యవైశ్య సామాజిక వర్గం అండగా ఉంటుంది. తెదేపాలో కొందరు బోస్ కు మద్డదు ఇచ్చే అవకాశం ఉంది. బోస్ కు వైసిపి టిక్కెట్టు ఇస్తే అమరనాధ రెడ్డికి గట్టి పోటి ఇవ్వగలరని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.