కింగ్ మేకర్ సూరా సుధాకర్ రెడ్డి
కొందరు కింగ్ మేకర్లలుగా ఉండటానికే ఇష్టపడుతారు. నిచ్చెనగా మారి నమ్ముకున్న వారిని పైకి ఎక్కిస్తుంటారు. వారికి వ్యక్తిగత అభివృద్ధి, పదవుల మీద ఆశ ఉండదు. తన పదవి కంటే పార్టీ నిర్మాణం, నమ్ముకున్న వాళ్ళ అభివృద్ధి మీదనే మక్కువ ఎక్కువ. నమ్మిన స్నేహం కోసం రేయింబవళ్ళు కష్టపడుతారు. వెట్టి చాకిరీ చేస్తారు. సొంత డబ్బును ఖర్చు పెట్టుకుంటారు. స్నేహం కోసమే జిల్లా మొత్తం కాలినడకన చుట్టేస్తారు. నమ్మిన వారికి ఆపద వస్తే ప్రాణం అడ్దేస్తారు. ఎలాంటి ఇబ్బండులనైనా భరిస్తారు. స్నేహ హస్తాన్ని అందించడంలో వెనుకడుగు వేయరు. ఆవేదనను పెదవి దాటాకుంటా అణచుకుంటారు. తిరిగి నమ్మినవారి అభివృద్ధికే అంకితం అవుతారు. అలాంటి వారిలో తిరుపతికి చెందిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి సూరా సుధాకర్ రెడ్డి ఒకరు. ఆయనకు విద్యార్థి దశ నుంచి టిడిపి అధినేత చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉంది. 1982లో ఎన్టీఆర్ తెలుగు దేశం స్థాపించినప్పటి నుంచి కార్యకర్తగా ఉన్నారు. తిరుపతిలో 100 ఏళ్ళ చరిత్ర ఉన్న పాండ్రవేటి, సూరా, ఇరికి తదితర కుటుంబాలలో వారిది ఒకటి. పి హెచ్ డి చేసిన ఆయనకు డబ్బు, చదువు, కుటుంబ నేపథ్యం, పార్టీ పట్ల విధేయత ఉన్నప్పటికి అధికారిక పదవులకు దూరంగా ఉన్నారు. ఎమ్మెల్యే, కార్పోరేషన్ చైర్మన్, టిటిడి, తుడా చైర్మన్ లాంటి ఒక పదవి కూడా అనుభవించలేదు. పార్టీ పిలుపు ఇస్తే పరుగులు తీస్తుంటారు.
చదివారు. ఆదశలో అదే వీధిలో ఉన్న ఆయనకు చంద్రబాబుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 1977 -79 ఎం ఎ పాపులేషన్ స్టడీస్ చదివారు. అప్పటిలో చంద్రబాబు ఎకనామిక్స్ లో పరిశోధన విద్యార్థిగా ఉన్నారు. విద్యార్థి నాయకునిగా ఉన్న ఆయనతో పాటు తిరిగారు. 1978 లో చంద్రబాబు చంద్రగిరి ఎమ్మెల్యే అయ్యారు. సుధాకర్ రెడ్డి 1980- 85 మధ్య కాలంలో పి హెచ్ డి చేశారు. 1982లో టిడిపిలో చేరి కార్యకర్తగా పని చేస్తున్నారు. 1984 నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి నప్పుడు చంద్రబాబు నాయకత్వంలో తిరుపతి వీదుల్లో పోరాటం చేశారు.
1985 - 99 పట్టణ నాయకుడుగా ఉంటూ ప్రతి ఎన్నికలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. 1998 లో తిరుపతి రూరల్ మండలం చెన్నాయ గుంట గ్రామానికి రోడ్డు కోసం తన స్వంత భూమిలో అర్ధ ఎకరా ఉచితంగా ఇచ్చారు. రోడ్డు నిర్మాణం కావడంతో దశాబ్దాలు గా ఉన్న సమస్య తోరింది. 1999 - 2002 తిరుపతి పట్టణ కమిటీ ఉపాధ్యక్షుడుగా పనిచేశారు. 2002 - 2004 జిల్లా కార్యదర్శి (హెచ్ ఆర్ డి)గా ఉన్నారు. 2005 నుంచి 2015 జిల్లా ఉపాధ్యక్షుడుగా పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు నగరి నియోజక వర్గం సమన్వయకర్తగా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. దీని వల్ల 2005లో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో తొమ్మిది మంది కౌన్సిలర్ల గెలిచారు. 2009 గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. 2007లో కుప్పం నుంచి సత్యవేడు వరకు 15 రోజుల పాటు 700 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశారు.
2009 లోక్ సభ ఎన్నికల్లో టిడిపి తిరుపతి అభ్యర్ధిగా వర్ల రామయ్య పోటీ చేసినప్పుడు జనరల్ ఏజెంటుగా ఉన్నారు. 2011లో కాణిపాకం నుంచి పూతలపట్టు వరకు రైతు పోరుబాట పాదయాత్రలో చంద్రబాబుతో కలిసి నడిచారు. చిత్తూరులో పార్టీ కార్యాలయం కట్టడంలో తన వంతు కృషి చేశారు. 2017 - 19 రాష్ట్ర గ్రంధాలయ సంస్థ సభ్యులుగా ఉన్నారు. 2020 రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఇప్పుడు అదనంగా పీలేరు నియోజకవర్గం పరిశీలకునిగా ఉన్నారు. గతంలో పలు నియోజక వర్గాల పరిశీలకునిగా బాధ్యతలు నిర్వహించారు.
1998 నుంచి 2003 వరకు చిత్తూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్నారు. అలాగే ఎపి బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో 1999, 2000 లో తిరుపతిలో రాష్ట్రస్థాయి బాడ్మింటన్ పోటీలు జరిగాయి. ఆయన కృషి వల్ల తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు అయ్యింది. దీనికోసం మునిసిపాలిటి స్థలాన్ని క్రీడా సాధికార (శాప్) కి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. అందులో బ్యాడ్మింటన్ ఇండోర్ కోర్టు, టెన్నిస్ సింథటిక్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ ఉన్న స్పోర్ట్ కాంప్లెక్స్ ను 2003లో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. తరువాత అందులో స్కేటింగ్ రింకు కూడా నిర్మించారు.
పార్టీకి సుదీర్ఘ సేవలు అందించిన సూరా సుధాకర్ రెడ్డి చంద్రబాబు ఆదేశిస్తే తిరుపతిలో పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నారు. అవకాశం కల్పిస్తే ఎన్నికల్లో గెలిచి కింగ్ అవుతానన్న విశ్వాసంతో ఉన్నారు. తనకు అత్యంత సన్నిహితుడు అయిన సూరా సుధాకర్ రెడ్డిని చంద్రబాబు కింగ్ గా చూడాలనుకుంటున్నారో, కింగ్ మేకర్ గా మాత్రమే పరిమితం చేయాలనుకుంటున్నారో రానున్న ఎన్నికల్లో తేలనుంది.

