శ్రీకాళహస్తి టిక్కెట్టు బరిలో డీకే చైతన్య
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నుంచి జనసేన అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త DK ఆదికేశవులు మనమరాలు చైతన్య పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆమె అదికేసువులు కూతురు బిడ్డ. ఆమె శ్రీకాళహస్తికి చెందిన డాక్టర్ ను వివాహమాడారు. ఇటేవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీలో చేరారు. వారు కూడా చైతన్యను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాను శ్రీకాళహస్తి నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఆకాంక్షను ఆమె ఈ సందర్భంగా వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందుకు జనసేన నాయకులు కూడా సానుకూలంగా స్పందించి, ఆమె పేరును పరిశీలిస్తామని అన్నట్లు తెలుస్తుంది. ఆమె ఇటీవల చిత్తూరులోని బాలా త్రిపురసుందరి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ MLA SCV నాయుడు, బిసి నాయకుడు గురువారెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. జనసేన తరఫున వినుత నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేసి నిత్యం ప్రజలతో సంబంధాలను కలిగి ఉన్నారు. ప్రజా సమస్యలపై తనదైనశైలిలో పోరాడుతున్నారు. శ్రీకాళహస్తి నుంచి వినుత టిక్కెట్టును ఆశిస్తుండగా, ఊహించని విధంగా చైతన్య తరమీదికి వచ్చారు.
అయితే తెలుగుదేశం, పార్టీ జనసేన పొత్తులో శ్రీకాళహస్తి సీటు ఏ పార్టీకి కేటాయిస్తారో వేచి చూడాల్సి ఉంది. జనసేనకు శ్రీకాళహస్తిని కేటాయిస్తే చైతన్య అభ్యర్థిని పరిశీలించే అవకాశం ఉంది. ఆమె బలిజ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఆమె మామ గురవయ్య నాయుడు తెలుగుదేశం పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు. మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డితో కలిసి పార్టీ పటిష్టతకు, పార్టీ గెలుపుకు దోహదపడ్డారు.