సమస్యలు పరిష్కారం అయ్యేవరకు సమ్మె
సమ్మె సందర్భంగా సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఆలోచించకుండా దౌర్జన్యానికి దిగుతూ సమ్మెలో ఉంటున్న అంగన్వాడీలకు సంబంధం లేకుండా రాత్రుల్లో వెళ్లి సెంటర్ తాళాలు పగలకొట్టడం దుర్మార్గమని ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. గతంలో అనేక పోరాటాలు సందర్భంగా ప్రభుత్వాలు అరెస్టులు చేయడం కేసులు పెట్టడం లాంటి పద్ధతిలో అణచివేయడం ప్రయత్నం చేశారు తప్ప దౌర్జన్యం చేయలేదని నేటి ప్రభుత్వం భౌతికంగా దాడులకు దిగడం దారుణం అన్నారు. ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే పోరాటాన్ని ఉధృతం చేస్తామని దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముఖ్యమైన సమస్యలు వేతనాలు పెంచడం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాటివిటీ అమలు చేయడం లాంటి వాటిని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
ఏఐటియుసి జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్ నాగరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు పి. చైతన్యలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ దౌర్జన్య కాండను తీవ్రంగా ఖండించారు. తప్పుడు పద్ధతుల్లో సమ్మెను భగ్నం చేయాలని చూస్తే అంగన్వాడీల విషయంలో అది సాధ్యం కాదని వాళ్ళ ఐక్యత వాళ్ళు పోరాటం రెట్టింపు అవుతుందని హెచ్చరించారు. మహిళా పక్షపాత అని చెప్పుకునే ప్రభుత్వం అంగన్వాడీలు మహిళలు లాగా కనపడడం లేదా అపి ప్రశ్నించారు. టూఅంగన్వాడీలు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని మీరు ఇచ్చిన హామీలే అమలు చేయమని అడుగుతుంటే దౌర్జన్యాలు చేయడం తగదన్నారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. గత ప్రభుత్వాలు కూడా ఇలా అణచివేయడానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వాన్ని కూల్చేసిన శక్తి అంగన్వాడీలకు ఉందని అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని తెలిపారు. జిల్లాలోని అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైంది కాదు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులే చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది తెలిపారు ఇప్పటికైనా అంగన్వాడి సమస్యలను పరిష్కారం చేసి దిశగా ఆలోచించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిఐటియు నాయకులు సుజని ,బుజ్జి ఏఐటీయూసీ నాయకులు ప్రభావతి లతోపాటు జ్యోతి, డి.చంద్ర, కే.రమాదేవి, గోపీనాథ్, మణి, బాలాజీ రావు, అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వినతిపత్రం ఇవ్వడం జరిగింది.