6, డిసెంబర్ 2023, బుధవారం

బాబును నమ్మితే జీరోలు... వీడితే హీరోలు..




చంద్రబాబుతో విభేదించి టిడిపి నుంచి వెళ్లి పోయిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. అలాగే టిడిపి నుంచి బయటికి వెళ్ళిన రేవంత్ రెడ్డి గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఏపీలో టిడిపిని వదిలి పెట్టిన కొడాలి నాని, ఆర్ కె రోజా, విడుదల రజిని మంత్రులు అయ్యారు. టిడిపిలో వర్ల రామయ్య కనీసం ఎంపీ కూడా కాలేదని నెటిజన్లు అంటున్నారు. చిత్తూరు జిల్లా నారా చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లా కావడంతో పార్టీ అధికారంలో ఉన్నపుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పదవుల విషయంలో మిగతా జిల్లాలతో  పోలిస్తే ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు. కారణం చంద్రబాబు వ్యక్తిగతంగా తెలియడం, చంద్రబాబుతో కలిసిమెలిసి తిరగడం పార్టీకి వెన్నదన్నగా ఉండటం. అన్ని విషయాలు చంద్రబాబుకు తెలుసని అనుకుంటారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లాలో జిల్లాకు కూడా సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో చాలామంది ఆశలు నెరవేరలేదు. దీంతో జిల్లాలో రకరకాల సామెతలు పుట్టుకొని వచ్చాయి. "చంద్రబాబుని నమ్ముకో - ఉన్నది అమ్ముకో",  చంద్రబాబుని నమ్మి బాగుపడిన వారు లేరు- జగన్ ను నమ్మి నష్టపోయిన వారు లేరు" అంటూ సామెతలు పుట్టుకొచ్చాయి. అలాగే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావును నమ్మితే పదవుల వర్షం కురిసేది. దీంతో చంద్రబాబు నాయుడు మీద అనేక సామెతలు, జోకులు టిడిపి శ్రేణులలో తిరుగుతున్నాయి. చంద్రబాబు నమ్మిన వాళ్లకు ఏమి చేయాలని, చంద్రబాబు భుజం మీద చేయి వేస్తే ఇక భవిష్యత్తు అంతేనని సరదాగా చెప్పుకుంటారు. చంద్రబాబును కలిసి ఎవరు ఏమి అడిగినా 'మీ గురించి నాకు అంతా తెలుసు సరైన సమయంలో మీకు చేస్తానంటూ' హామీలు గుప్పింస్తుంటారు. అంతకుమించి చేసేది ఏమీ ఉండదు. దీంతో చంద్రబాబు మీద వైరల్ అవుతున్న కొన్ని విషయాలతో ఈ వార్త. ఎవరిని నొప్పించడానికి కాదు. ఏదో సరదాగా ....


చిత్తూరు జిల్లాకు వస్తే ఒకప్పుడు చిత్తూరు టైగర్ గా పేరు తెచ్చుకున్న సి కె బాబు టిడిపిలో చేరిన తరువాత  తెరమరుగాయ్యారు. నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయిన ఆయనకు కనీసం ఇంచార్జి పదవి కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో నాలుగు సార్లు చంద్రగిరి  ఎమ్మెల్యే, రెండు సార్లు  మంత్రిగా పనిచేసిన గల్లా అరుణ కుమారి ఇప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు. అలాగే ఐదుసార్లు ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, మంత్రి అయిన కాంగ్రెస్ నేత డాక్టర్ గుమ్మడి కుతూహలం టిడిపిలో చేరి రాజకీయ భవిష్యత్ కోల్పోయారు.

చిత్తూరు జిల్లా రాజకీయాలలో ఒకప్పుడు చక్రం తిప్పిన రెడ్డివారి నాదముని రెడ్డి కుమారుడు మాజీ డీసీసీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు టిడిపిలో కనిపించడం లేదు. మాజీ డీసీసీ అధ్యక్షుడు అయిన 1999లో ఆయన టిడిపిలో చేరి పుత్తూరు ఎమ్మెల్యే అయ్యారు. 2004లో  అలిపిరి బాంబ్ బ్లాస్ట్ సమయంలో చంద్రబాబుతో పాటు  కారులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన చదలవాడ కృష్ణమూర్తి ఒకసారి తిరుపతి  ఎమ్మెల్యే, ఒక సారి టీటీడి చైర్మన్ అయిన తరువాత నిరాదరణకు గురయ్యారు. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడి పోయారు. పేరుకు జాతీయ ప్రధాన కార్యదర్శి అయినప్పటికీ పిలేరుకే పరిమితం చేశారు. నేను ఒరిజినల్ రెడ్డిని, నా పేరు నాటు బాంబు సుధాకర్ రెడ్డి అంటూ సవాళ్లు విసిరిన డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి  టిడిపిలో చేరి అధికార ప్రతినిధి అయిన తరువాత  తోక తెగిన బల్లి అయ్యారు. ఇక జిల్లాలో టిడిపిని వదిలి పెట్టిన డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. చింతల రామచంద్రా రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేసిన రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు ఆయనకు పార్టీలో తగిన గుర్తింపు రాలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో జిల్లా పరిషత్తు చైర్మన్ ఏం రెడ్డమ్మ ప్రస్తుతం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా పనిచేస్తున్నారు.

కొంత విరామం తర్వాత గాలి ముద్దుకృష్ణమనాయుడు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన తొలిత చంద్రబాబును విభేదించి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కొద్దిరోజులు బిజెపిలో కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయనకు మంత్రి పదవి రాలేదు. MLCకే పరిమితం అయ్యారు. ఎన్టీ రామారావు హయంలో ఆయనకు విధేయులుగా ఉన్న గాలి ముద్దుకృష్ణమనాయుడు, మురుగయ్య,, ఎమ్మార్సీ రెడ్డిలకు పదవుల వర్షం కురిసింది. అనేక పదవులు వారిని వరించాయి. కొన్ని పదవులకు వారు స్వీకరించలేదు.  మోహన్ రెడ్డికి పాదయాత్ర సమయంలో డాక్టర్ గా పనిచేసిన తిరుపతికి చెందిన గురుమూర్తికి ఎంపీ పదవీ లభించింది. ఆముదాల శ్రీహరి NTR హయంలో ఒక వెలుగు వెలిగారు. రాష్ట్ర స్థాయి పార్టీ పదవులు, నామినేట్ పదవులు అలరించారు. జిల్లాలో చక్రం తిప్పారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. 

టిడిపిని వీడితే హీరోలు అవుతారు చేరితే జీరోలు కాక తప్పదు అన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా  సాగుతోంది. బాబును నమ్ము కుంటే  ఆస్తులు అమ్ముకోవాలి అంటున్నారు. ఆ మేరకు చంద్రబాబు స్వంత జిల్లాలో ఇతర పార్టీల కార్యకర్తలు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టిడిపి నుంచి వెళ్లి పోయిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎం గా ఉన్నారు. అలాగే టిడిపి నుంచి బయటికి వెళ్ళిన రేవంత్ రెడ్డి గురువారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఏపీలో టిడిపిని వదిలి పెట్టిన కొడాలి నాని, ఆర్ కె రోజా, విడుదల రజిని మంత్రులు అయ్యారు. టిడిపిలో వర్ల రామయ్య కనీసం ఎంపీ కూడా కాలేదు అంటున్నారు. దీనికి చంద్రబాబు ఆలోచనా దోరణి కారణం అంటున్నారు. ఆయన నమ్ముకున్న వారిని కూడా అణచి వేస్తారని, ఎవరు ఎదగడం ఆయనకు ఇష్టం ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ని వీడితేనే భవిష్యత్, టీడీపీ ని వీడండి భవిష్యత్తుకి బంగారు బాటలు వేయండి అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *