8, డిసెంబర్ 2023, శుక్రవారం

ఆ కులం ఎమ్మెల్యేలు ఎందుకు తగ్గుతున్నారు ?

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వంత జిల్లాలో ఆయన సామాజిక వర్గం రాజకీయంగా పట్టు కోల్పోయింది. ఒకప్పుడు జిల్లా కేంద్రంలో చక్రం తిప్పిన ఆ సామాజిక వర్గం ఇప్పుడు నామ మాత్రంగా తరారైంది. టిడిపి ఏర్పాటు కాక ముందు ఎన్ పి చంగాల్రాయ నాయుడు బంగళా చుట్టూ రాజకీయం తిరిగేది. ఆయన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి వర్గంగా ముద్ర పడ్డారు.ఆయనకు వ్యతిరేకంగా పాటూరు రాజగోపాల్ నాయుడు రాజకీయం నడిపారు. ఆయన ఆచార్య ఎన్ జి రంగా అనుచరుడిగా చలామణి అయ్యారు. ఎవరు రాజకీయం చేయాలన్నా ఈ ఇద్దరు నాయుళ్ళలో ఒకరి మద్దతు తప్పనిసరి అయ్యింది. చంగల్రాయ నాయుడు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు  రాజగోపాల్ నాయుడు కృషికార్ లోక్ పార్టీ లో ఉన్నారు. ఎన్ పి సి కాంగ్రెస్ వీడగానే రాజగోపాల్ నాయుడు కాంగ్రెస్ లో ప్రధాన పాత్ర పోషించారు. 



అంటే జిల్లాలో ఉన్న 14 స్థానాలలో ఏడు నియోజక వర్గాలలో ఎప్పుడో ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించారు. 1983 లో అత్యధికంగా ఆరుగురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అందులో ఒకరైన ఎన్టీఆర్ తరువాత రాజీనామా చేశారు.1985 లో నలుగురు,1989 ముగ్గురు,1994 నలుగురు గెలిచారు. 1999లో ముగ్గురు 2004లో ఐదు 2009 లో ముగ్గురు గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు ఒకరే గెలిచారు. ప్రతి ఎన్నికలో జిల్లా నుంచి నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలుగా గెలిచే వారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఒకరే గెలవడం విశేషం. గతంలో కిలారి గోపాల్ నాయుడు, చంద్రబాబు నాయుడు, గాలి ముద్దు కృష్ణమ నాయుడు, గల్లా అరుణకుమారి  మంత్రులుగా చేశారు. చంద్రబాబు నాయుడు మాత్రం 14 ఏళ్ళు ముఖ్య మంత్రి2014 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు తప్ప ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కూడా ఓడించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి పట్టుదలగా ఉన్నారు. 



ఆ సామాజిక వర్గం ప్రభావం క్రమంగా తగ్గుతూ వచ్చింది. చిత్తూరు లోక్ సభకు 1962 లో జరిగిన ఎన్నికల్లో గుంటూరుకు చెందిన ఎన్ జి రంగా కృషి కార్ లోక్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 1967 లో ఎన్ పి చంగాల్రాయ నాయుడు, 1977, 1980 లో పి రాజగోపాల్ నాయుడు కాంగ్రెస్ టిక్కెట్టుపై గెలిచారు. 1984 ఎన్నికల్లో ఎన్ పి ఝాన్సీ లక్ష్మి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి 1962 సి డి నాయుడు, 2967,1972 లో డి ఆంజనేయులు నాయుడు కాంగ్రెస్ అభ్యర్థులుగా  గెలిచారు. 1978 లో ఎన్ పి వేంకటేశ్వర చౌదరి (జనతా), 1983 లో ఎన్ పి ఝాన్సీ లక్ష్మి (టిడిపి) విజయం సాధించారు. తరువాత ఇప్పటి వరకు ఆ  సామాజిక వర్గం  వారు ఎవరు గెలవలేదు.



ఒకప్పుడు చంద్రగిరి కమ్మ సామాజిక వర్గానికి పెట్టని కోటలా ఉండేది. 1978 లో  చంద్రబాబు  నాయుడు తొలి సారిగా ఇక్కడి నుంచి  కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. 1983 లో ఎం వెంకట్రామ నాయుడు (టిడిపి) చంద్రబాబును ఓడించారు. 1985 లో ఎన్ ఆర్ జయదేవ నాయుడు, 1994 లో నారా రామమూర్తి నాయుడు టిడిపి టిక్కెట్టుపై ఎమ్మెల్యే అయ్యారు. 1989,1999, 2004, 2009 ఎన్నికల్లో గల్లా అరుణ కుమారి కాంగ్రెస్ టిక్కెట్టు పై గెలిచారు. 2014, 2019 అక్కడ వైసిపి అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయం సాధించారు.



పుత్తూరులో  గాలి ముద్దు కృష్ణమ నాయుడుకు ఐదు 1983 నుంచి ఐదు  2004 వరకు ఐదు సార్లు గెలిచారు, మంత్రిగా పనిచేశారు. 1999 లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి ఆర్ రాజశేఖర రెడ్డి చేతిలో ఓడిపోయారు. నగరిలో  నియోజక వర్గంలో 2967,1972 లో  గెలిచిన కిలారి గోపాల నాయుడు ( కాంగ్రెస్) మంత్రిగా కూడా చేశారు.  2009 గాలి ముద్దు కృష్ణమ నాయుడు (టిడిపి) ఇక్కడి నుంచి ఒక సారి విజయం సాధించారు.


కుప్పంలో 1978లో బి ఆర్ దొరస్వామి నాయుడు (కాంగ్రెస్), 1983,1985 ఎన్ రంగస్వామి నాయుడు (టిడిపి) విజయం సాధించారు. 1989 నుంచి చంద్రబాబు నాయుడు  వరుసగా ఏడు సార్లు గెలిచారు. ఆయన 14 యేళ్లు ముఖ్య మంత్రిగా ఉన్నారు. మదనపల్లెలో  1978లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన జి వి నారాయణ రెడ్డి (కాంగ్రెస్) గెలిచారు. 1983,1985 లో రాట కొండ నారాయణ రెడ్డి, 1994 లో రాటకొండ సాగర్ రెడ్డి, 1999 లో రాటకొండ శోభ, 2004 లో దొమ్మాలపాటి రమేష్ టిడిపి టిక్కెట్ పై గెలిచారు.


శ్రీకాళహస్తిలో 1978 లో ఉన్నం సుబ్రమణ్యం నాయుడు, 2004 లో ఎస్ సి వి నాయుడు కాంగ్రెస్ టిక్కెట్ పై విజయం సాధించారు.  గతంలో కాంగ్రెస్ పార్టీలో కనీసం ముగ్గురు కమ్మ సామాజిక వర్గం నేతలకు టిక్కెట్లు ఇచ్చేవారు. జగన్ పార్టీ పెట్టిన తరువాత ఆ సామాజిక వర్గం నేతలకు ఏ మాత్రం అవకాశం కల్పించ లేదు. నియోజక వర్గాల  పునర్వ్యవస్థీకరణ తరువాత కమ్మ సామాజిక వర్గానికి అనుకూలమైన ఒక్క నియోజక వర్గం ఒక్కటి కూడా లేక పోవడమే ఇందుకు  కారణం. దీనితో చంద్రబాబు నాయుడు కూడా రెడ్డి సామాజిక వర్గం నేతలకు ఎక్కువ టిక్కెట్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *