15 సూత్రాల అమలు కమిటీ సభ్యులుగా అర్షద్ ఆయుబ్ ఖాన్
మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల అమలు కమిటీ రాష్ట్ర సభ్యులుగా చిత్తూరుకు చెందిన పాత్రికేయుడు యం. అర్షద్ ఆయుబ్ ఖాన్ ను నియమిస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అర్షద్ ఆయుబ్ ఖాన్ గతంలో ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ పేషి లో పీఆర్వోగా, జాతీయ మైనార్టీ కమిషన్ సలహాదారుల ప్యానల్ సభ్యునిగా ఉన్నారు.
మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం ప్రధానమంత్రి నూతన 15 సూత్రాల అమలు కమిటీలో రాష్ట్ర సభ్యునిగా అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు SB.అంజాత్ బాషాకు, అటవీ శాఖ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇంతియాజ్ కు, జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్ పురకి, జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యులు సయ్యద్ షహజాదికి కృతజ్ఞతలు తెలిపారు.
మైనారిటీ కమ్యూనిటీలోని వెనుకబడిన మరియు బలహీన వర్గాలకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు సమాన అవకాశాలు ఉండేలా చూసేందుకు, మొత్తం సామాజిక అభివృద్ధి సాధనకు దోహదపడాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 15 సూత్రాల రాష్ట్ర కమిటీ లో సభ్యునిగా అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉందని అర్షద్ ఆయుబ్ ఖాన్ అన్నారు. రానున్న రోజుల్లో మైనార్టీ వర్గాల కోసం, పథకాల అమలుపై వివిధ శాఖలతో సమీక్షలు సమావేశాలు నిర్వహించి పథకాల అమలు చేసే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.

