ఇక ఆంధ్రలో అన్నా, చెల్లెల సమరం !
కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించి మంచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద తమ దృష్టిని సాధించింది. ఆంధ్రప్రదేశ్లో పార్టీని పటిష్టం చేసి రానున్న ఎన్నికలకు సంసిద్ధం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం. ఆమెను పిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తారని భావిస్తున్నారు. ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో అన్న వైయస్ జగన్మోహన్ రెడ్డికి, చెల్లెలు వైయస్ షర్మిలకు పోటాపోటీగా ఎన్నికల యుద్ధం ప్రారంభం అవుతుంది. యుద్ధంలో తాము గెలవకపోయినా, జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి రాకూడదన్న కృతనిర్చయంతో శార్మిలతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఉన్నట్లు సమాచారం. అవసరమైతే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి సహకరించాలని కూడా ముందస్తు ఆలోచనగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ ను నియమించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి జరగనున్న సమావేశంలో ఏపీ సి సి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, సి డబ్ల్యూ సి సభ్యుడు రఘువీరారెడ్డి, మాజీ ఎంపీ కెవిపి రామచంద్రరావు, మాజీ కేంద్రమంత్రి చింతామోహన్, కొప్పల వీర్రారాజు, జెడి శీలంతోపాటు పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కర్రి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని ఆంధ్రాలో అనుసరించాల్సిన యోగం గురించి చర్చించారు.