20, డిసెంబర్ 2023, బుధవారం

ఫిబ్రవరి 10న ఎన్నికల నగారా?

 
రాష్ట్ర ప్రజలు ఎప్పుసప్పుదని ఎదురుచూస్తున్నన ఎన్నికలు కనుచూపు మేరలోనే కనిపిస్తున్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే, రెండు నెలల్లో ఎన్నికల నగారా మ్రోగనుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. వైసిపి అభ్యర్థుల మీద కసరత్తు ముమ్మరం చేసింది. తెలుగుదేశం పార్టీ యువగళం పాదయాత్రను ముగించింది. పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. అభ్యర్థుల విషయంలో కసరత్తు ప్రారంభం కానుంది. 

పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దమవుతోంది.ఈ నేపథ్యంలోనే ఏపీలో వచ్చే ఫిబ్రవరి 10వ తేది ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదల చేసే దిశగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగానే ముహూర్తం కూడా ఖరారైనట్లు చెబుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర కమిషన్ కు కూడా సమాచారం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. 

2019 సాధారణ ఎన్నికలకు సంబంధించి మార్చి 3వ తేది కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలు గత ఎన్నికలకంటే 20రోజులు ముందుగానే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని, ఇప్పటికే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నాయి. ఇటీవల సీఎం జగన్ కూడా మంత్రులతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా గత రెండు రోజుల క్రితం ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ ఫిబ్రవరిలోనే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని, ఆ దిశగా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు. 

ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ దిశగానే ఎన్నికల కమిషన్ ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఇస్తే రాష్ట్రంలో 20 రోజులు ముందుగానే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు చేస్తున్న హడావుడిని చూస్తసంటే పై ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది.


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *