17, డిసెంబర్ 2023, ఆదివారం

చిత్తపారలో మెడికల్ క్యాంపు

 


జన జాగృతి స్వచ్ఛంద సంస్థ గుడిపాల మండలం చిత్తపార గ్రామంలో వైదేహి హాస్పిటల్స్ బెంగళూరు సహకారంతో ఆదివారం మెడికల్ క్యాంపు నిర్వహించారు. జన జాగృతి సంస్థ కార్యదర్శి చిట్టిబాబు కొల్లా  మాట్లాడుతూ సామాజిక సేవ కార్యక్రమాలలో భాగంగా మండలంలోని మారుమూల ప్రాంతమైన చిత్తపారలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. సుమారు 200 మంది వైద్య శిబిరానికి హాజరైనారు. వైదేహి హాస్పిటల్స్ నుండి పదిమంది డాక్టర్లు విచ్చేశారు. ఉచితంగా ప్రాథమిక మందులు ఇవ్వడం జరిగింది.


ప్రధాని నరేంద్ర మోడీ  ఆశయాల మేరకు ఆరోగ్య భారత్ ను నిర్మించడంలో జన జాగృతి సంస్థ తన వంతు బాధ్యతగా  గుడిపాల మండలంలో ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసింది. కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైదేహి సమన్వయకర్త లోకేష్,  బిజెపి నాయకులు సోమనాథ్ గౌడ్ , రామభద్ర,  నాటాం పెరుమాళ్, సాయి ప్రతాప్, దేవా, ప్రకాష్ రంజిత్, సర్పంచి రవి తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *