11, డిసెంబర్ 2023, సోమవారం

టిడిపి, జనసేన మధ్య టిక్కెట్టు పోరు

ఇరు పార్టీల నేతల మధ్య  లోపించిన సమన్వయం 

పోటా పోటీగా కార్యక్రమాలు

బాహాబాహికి దిగిన ఇరువర్గాలు 

జనసేనకు టిక్కెటు ఇవ్వాలని తెదేపా విజ్ఞప్తి




గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం, జనసేన నాయకులు  రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ మండల స్థాయి వరకు కలిసి పని చేయాలని అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేశారు. అయితే గంగాధర్ నెల్లూరు రిజర్వ్ నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ థామస్, జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ యుగంధర్ కలిసి పనిచేయడం లేదు. పైగా వారిద్దరి మధ్య ఆదిపత్య పోరు ప్రారంభమయ్యింది. పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే పరిస్థితి. టికెట్ రేసులో నువ్వా నేనా అంటూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపధ్యంలో ఇటీవల పాలసముద్రం మండలంలోని ఒక గ్రామంలో ఒకే రోజు 10 నిమిషాల తేడాతో ఇరు పార్టీలు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఒకరితోనొకరు సంబంధం లేకుండా వేరువేరుగా తమ పార్టీకి అభ్యర్థి వేసి, తమను గెలిపించాలని ధామస్, యుగంధర్ లు  విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల నేతలు ఒకచోట తటస్తపడ్డారు. దీంతో ఇది వర్గాల మధ్య మాట మాట పెరిగింది. ఇరువర్గాలు వివాదానికి దిగాయి. ఇరు వర్గాల మధ్య బాహాబాహీ జరగకుండా నేతలు అడ్డుకున్నారు.



ఈ నియోజకవర్గంలో మరో విచిత్రమైన పరిస్థితి కూడా నెలకొంది.ఏ పార్టీ నాయకులైన ఆ పార్టీ అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని కోరడం ఆనవాయితీ. అది సంప్రదాయం. కూడా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ఆదిపత్యాన్ని చాటాలని చూస్తారు. అయితే గంగాధర నెల్లూరులో మాత్రం పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు ఒకరు చంద్రబాబును కలిసి గంగాధర నెల్లూరు టికెట్ను జనసేన అభ్యర్థి ఉన్న యుగంధర్ కు కేటాయించాల్సిందిగా కోరినట్లు వాట్సాప్ గ్రూపులో ఒక పోస్టు వైరల్ అవుతుంది. గంగాధర నెల్లూరు టికెట్ యుగంధర్ కాకుండా తెలుగుదేశం పార్టీకి ఇస్తే తాము పని చేసేది లేదని చెప్పినట్లు తెలిసింది. ఈ పోస్టును చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.


పొత్తులో భాగంగా గంగాధర నెల్లూరు టికెట్ జనసేన ఇంచార్జి, డాక్టర్ పొన్న యుగంధర్ కు  వస్తుందన్న ప్రచారం ఉంది. అయితే తనకే టిక్కెట్టు వస్తుందని, ఆ విషయం చంద్రబాబు ప్రకటించారని ఇటీవల టిడిపి ఇంచార్జి డాక్టర్ వి ఎం థామస్ ప్రకటించారు. ఆయన  చావులకు వెళ్ళినపుడు దళితులకు డబ్బు పంచి ధన నేతగా పేరు తెచ్చుకున్నారు. అయితే యుగంధర్ ప్రజా సమస్యలపై పోరాడి జననేత అన్న పేరు తెచ్చుకున్నారు. దీనితో ధన నేత, జన నేత మధ్య 'కోల్డ్ వార్' జరుగుతున్నది.


 ముందుగా జనసేన జనం కోసం జనసేన భ్యావిస్యత్తు కార్యక్రమం నిర్ణయించారు. అయితే టిడిపి ఇంచార్జి పోటీగా మన థామస్ మన ఇంటికి పేరుతో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం గూర్చి పార్టీ  మండల కమిటీ అధ్యక్షుడు రాజేంద్రకు సమాచారం లేదు. సహజంగా మండల అధ్యక్షుని  ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగాలి. అయితే థామస్ ఆ సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు. దీని వెనక నియోజక వర్గం మాజీ సమన్వయ కర్త భీమినేని చిట్టిబాబు ప్రేరణ ఉందని తెలిసింది. రాజేంద్ర కూడా టిక్కెట్టు ఆశిస్తు ఉన్నందున ఆయనను దూరంగా పెట్టారని అంటున్నారు. కాగా జనసేన కార్యక్రమం లో చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు ఫోటోలు పెట్టారు. టిడిపి నాయకులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, నాగబాబును ఏమాత్రం పట్టించుకోలేదు. దీనితో నియోజక వర్గంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు మనే విధంగా తయారయ్యింది.  ఈ నేపథ్యంలో జన నేత యుగంధర్,  ధన నేత థామస్  మధ్య టిక్కెట్టు పోరు తీవ్రం  అయ్యింది. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే విషయంలో ఉత్కంఠ నెలకొన్నది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *