3, డిసెంబర్ 2023, ఆదివారం

కెసిఆర్ ఓటమి చంద్రబాబు విజయమే!

 


తెలంగాణలో తన రాజకీయ శత్రువైన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ను ఓడించడంతో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  విజయం సాధించారని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను పోటీలో నిలపకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహాయ సహకారాలను అందించారు. ఈ విషయాన్ని బయట ప్రకటించకపోయిన లోపాయకారిగా జరిగినా, ఈ విషయాలు బహిరంగ రహస్యమే. ఎన్నికలలో చంద్రబాబు మిత్రుడైన రేవంత్ రెడ్డి సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో తన రాజకీయ శత్రువు అయిన కెసిఆర్ ని చంద్రబాబు దెబ్బ కొట్టినట్లు అయింది. చంద్రబాబు కెసిఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఒకానొక సందర్భంలో వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా తీర్చుకున్నట్లు అయ్యింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం నాయకులు, శ్రేణులు, పండగ చేసుకుంటున్నాయి. పార్టీలో ఉత్సాహం, ఆనందం, జోష్ వ్యక్తం అవుతున్నాయి.


రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కెసిఆర్, ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలను చేపట్టారు. ఆనాటి నుంచి చంద్రబాబుకు, కెసిఆర్ కు అంత సఖ్యత లేదు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసిన ఎడమొఖం పెడముఖంగానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత కెసిఆర్ జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గరయ్యారు. ఆరు నెలలు ముందుగా తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు అన్ని రకాలుగా కెసిఆర్ జగన్ కు సహకరించారని తెలుస్తోంది. ఆర్థికంగా 1,500 కోట్ల రూపాయల నిధులను కూడా అందజేసినట్లు ఊహాగానాలు కొనసాగాయి. అలాగే ప్రచార వాహనాలను కూడా ఆంధ్రప్రదేశ్ కు పంపి జగన్ కు మద్దతుగా ప్రచారం చేశారని విమర్శలు ఉన్నాయి. వీటిని నిజం చేస్తూ జగన్ గెలిచిన తర్వాత ఆయనకు తెరాస ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు విందు ఇచ్చారు. విందు సమయముగా హైదరాబాద్ బిర్యాని స్వయంగా తినిపించారు. ఇందుకు ప్రతిఫలంగా అసెంబ్లీ స్థలాలను జగన్ కెసిఆర్ కు బహుమతిగా ఇచ్చారని ప్రచారం కూడా కొనసాగుతోంది.


ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఖండించలేదు. అలా అని చేసింది కరెక్ట్ అని కూడా చెప్పలేదు. కెసిఆర్ తనయుడు భరాస కార్యనిర్వహక అధ్యక్షుడు తారక రామారావు మాత్రం చట్టం పని చట్టం చేసుకుని పోతుందన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాదులో జరుగుతున్న అందోళన కార్యక్రమాలను అడ్డుకున్నారు. ఆందోళన కార్యక్రమాల మీద అంక్షలు విధించారు. పోలీసు కేసులను నమోదు చేశారు. ఆందోళన చేస్తున్న IT ఉద్యోగుల మీద కేసులను నమోదు చేసి, వారికి వారి యజమాన్యం చేత షోకాజ్ నోటీసులను అందజేయ విధంగా చర్యలు తీసుకున్నారు. మెట్రో రైల్లో ప్రయాణం చేస్తూ నిరసన తెలియజేసిన వారి మీద కేసులు పెట్టారు. కార్ల ర్యాలీ, బహిరంగ సభలు ఏర్పాటు చేసినా, అడుగడుగునా ఆంక్షలు విధించి, అడ్డుకునే ప్రయత్నం చేశారు.


తెలంగాణ కాంగ్రెస్ గెలుపుతో చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు


 చివరకు చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన తర్వాత విమానాశ్రయం నుంచి హైదరాబాదులోని నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఆయనకు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు తరలి వచ్చారు. దీనిపైన కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించాలని చంద్రబాబు మీద తెలంగాణ ప్రభుత్వం కేసును నమోదు చేసింది. ఇలా తన జగన్ పక్షపాతినని కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆయన అనుచరులు, పోలీసు యంత్రాంగం మరో మారు నిరూపించింది.



ఈ విషయమై  భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు మాట్లాడుతూ ఇది ఆంధ్రకు సంబంధించిన అంశంగా పేర్కొన్నారు. అక్కడ వివాదాన్ని తీసుకొని తెలంగాణలో ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేయడం తగదన్నారు. దీనిని తమ ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించదని స్పష్టం చేశారు. ఇలా కెసిఆర్ ప్రభుత్వం చంద్రబాబుకు పక్క విరోధిగా మారడంతో జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా లోపాయి కారిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సహకారం అందించింది. రాష్ట్రంలోని ఆంధ్ర సెటిలర్లు, కమ్మ సామాజిక వర్గం గుంపత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. దీంతో చాలా చోట్ల స్వల్ప తేడాతో తెరాస అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఇలా తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పోటీ చేయకపోయినా, ఘన విజయం సాధించింది. తాము అనుకున్న పార్టీని గెలిపించడంతోపాటు, తన శత్రువుకు మిత్రుడైన కెసిఆర్ ని ఓడించడంలో చంద్రబాబు కృతార్థులయ్యారు. ఈ విషయం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వర్గాలలో తీవ్ర చర్చనియంశం అయ్యింది.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *