29, డిసెంబర్ 2023, శుక్రవారం

అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా సిఐటియు, ఏఐటియుసి నిరసన


రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని వారి సమ్మెకు మద్దతుగా చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద సిఐటియు -ఏఐటియుసిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు దాసరి చంద్ర లు మాట్లాడుతూ 18 రోజులగా అంగన్వాడీలు చేస్తున్న పోరాటానికి ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్య దోరణితో వ్యవహరించడం దారుణమన్నారు. 


మంత్రి వర్గం చర్చలు పేరుతో దాటవేస్తున్నారని సరైన పద్ధతి కాదని విమర్శించారు. మరోపక్క మంత్రులు, ఎమ్మెల్యేలు అంగన్వాడీలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే పని చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వేయి రూపాయలు మాత్రమే పెంచి చేతులు దులుపుకున్నది. ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా వేయి రూపాయలు వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం  ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు చేస్తున్న పోరాటం ఉదృతం కాకముందే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కారం చేయాలని, మున్సిపల్ కార్మికుల సమ్మె చర్చలు కూడా విఫలమైనాయని వెంటనే మున్సిపల్ కార్మికులు  సమస్యలు కూడా పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహం కు వినతిపత్రం ఇస్తూ కార్మికులు సమస్యలు పరిష్కారం చేసే బుద్ధి కలిగించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటీయూసీ, ఎస్టియు నాయకులు గంటా మోహన్ లతో పాటు కార్మికుల అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *