2, డిసెంబర్ 2023, శనివారం

రెడ్ల తలమానికం తంబళ్ళపల్లి

 


తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీకి అండగా నిలచారు. 1983 నుంచి తంబళ్లపల్లెలో తొమ్మిది సార్లు సాధారణ ఎన్నికలు జరిగింది. 9 సార్లు జరిగిన ఎన్నికలలో 8 సార్లు రెడ్డి సామాజిక వర్గం నేతలు విజయం సాధించారు. ఒక సారి మాత్రం BC సామాజిక వర్గానికి చెందిన శంకర్ యాదవ్ గెలుపొందారు. ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున, ఒకసారి ఇండిపెండెంట్ గా కడప ప్రభాకర్ రెడ్డి మూడుసార్లు విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దిరెడ్డి ద్వారకనాధ రెడ్డి ఒకసారి గెలుపొందారు. ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీ తరపున BC సామాజికవర్గానికి చెందిన శంఖర్ యాదవ్, మాజీ MLA ప్రవీణ్ కుమార్ రెడ్డి, ముస్లిం మైనారిటీకి చెందిన పర్వీన్ తాజ్ రంగంలో ఉన్నారు.



తంబళ్లపల్లె నియోజకవర్గం కింద తంబళ్లపల్లి, మొలకలచెరువు, పెద్దమాండెం, కురుపులకోట,  బీ. కొత్తకోట, పెద్దతిప్ప సముద్రం మండలాలు వస్తాయి. నియోజకవర్గంలో గెలుపు వివరాలను పరిశీలిస్తే 1983లో టిఎన్ శ్రీనివాసులు రెడ్డి, 1985లో లక్ష్మీ దేవమ్మ తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించారు. 1989 లో జరిగిన ఎన్నికల్లో కడప ప్రభాకర్ రెడ్డి ఇండిపెండెంట్ గా గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో తిరిగి లక్ష్మీ దేవమ్మ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడప ప్రభాకర్ రెడ్డి సాధించారు. 2009 ఎన్నికలలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, 2014 ఎన్నికలలో శంకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2019 ఎన్నికలలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలలో ద్వారక నాగరెడ్డి స్థానికేతరులైన తంబళ్లపల్లి ఓటర్లు ఆదరించారు.



BC సామాజిక వర్గానికి చెందిన G. శంకర్ యాదవ్ 2014 ఎన్నికలలో శంకర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 2019 ఎన్నికలలో మళ్ళి పోటి చేసినా, YSR కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వరకనాధ రెడ్డి చేతిలో ఓడిపోయారు. కొంత విరామం తరువాత శంకర్ ను నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు. శంకర్ నివాసం బెంగళూరులో ఉంటున్నారు. వ్యాపారవేత్త. నియోజకవర్గంలో తెదేపా కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే విమర్శ ఉంది. అందుకే చాలా రోజులు తంబళ్ళపల్లి నియోజక వర్గానికి ఇంచార్జి లేకుండా ఖాలిగా ఉండింది. గత ఏడాది తిరిగి శంకర్ ను మూడు నెలల కాలానికి తహ్కలిక ఇన్చార్జిగా నియమించినా, ఆయనే కొనసాగుతున్నారు. 



అంగళ్ళ సంఘటనలో ఇతర జిల్లాల నాయకుల మీద కూడా కేసులు నమోదుకాగా, శంకర్ మీద నమోదుకాక పోవడం అంతు చిక్కని రహస్యంగా మారింది. తెలుగుదేశం పార్టీ నేతలు కింది నుంచి పై వరకు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు నుంచి సామాన్య కార్యకర్తగా మీద కూడా కేసులో నమోదు కాగా శంకర్ యాదవ్ మీద ఎందుకు నమోదు కాలేదు అన్నది ఇప్పటికీ తెలుగుదేశం శ్రేణులను తొలసి వేస్తున్న ప్రశ్న. ఈ సంఘటన తర్వాత కొంత కాలానికి చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగాయి. నియోజకవర్గంలో ఆందోళన కార్యక్రమాలలో పార్టీ ఇంచార్జ్ శంకర్ యాదవ్ పాల్గొనకపోవడం విమర్శలకు దారితీస్తోంది. నియోజకవర్గానికి ఇన్చార్జి ఉన్నారా లేదా అన్న ప్రశ్న స్థానిక నాయకులు కార్యకర్తలను తొలచి వేస్తుంది.



తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొదటి నుంచి అనిపిరెడ్డి లక్ష్మీదేవమ్మకు తెలుగుదేశం పార్టీలో గట్టిపట్టు ఉంది. ఆమె 1985, 1994 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున లక్ష్మీదేవమ్మ కుమారుడు అనిపిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తన పదవీ కలం ఉండగానే, పార్టీ వదలి YSR కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ను బీసీ వర్గాలకు చెందిన శంకర్ యాదవ్ కు ఇవ్వడంతో, ప్రవీణ్ కుమార్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శంకర్ మీద పోటీచేసి ఒతిపోయారు. శంకర్ నియోజకవర్గంలో అందుబాటులో లేకపోవడంతో తిరిగి నవీన్ కుమార్ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆయన కూడా సుముఖతను వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే చంద్రబాబు అరెస్టు సమయం ప్రవీణ్ కుమార్ కానీ, తల్లి లక్ష్మిదేవమ్మ కానీ ఖండించక పోవడం, ఆందోళన కార్యక్రమాలలో పల్గోనక పోవడం మీద చర్చ నడుస్తోంది. ప్రవీణ్ కుమార్ ఇప్పటి వరకు పార్టీలో చేరలేదు.


B. కొత్తకోటకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహ కార్యదర్శి ఎస్ ఎం పర్వీన్ తాజ్ తెదేపా కార్యక్రమాలలో చురుగ్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన తర్వాత పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలను ముందుండి నడిపారు. పార్టీ కార్యక్రమాలతో పార్టీ శ్రేణులను, నాయకులను ముందుకు నడుపుతున్నారు. ఆమె అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె మీద ఇప్పటికే పలు పోలీసు కేసులు కూడా పార్టీ పరంగా నమోదయ్యాయి. చాలాకాలంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. 



మైనారిటీ, బిసి, మహిళగా తంబళ్లపల్లి సీటుకు రానున్న ఎన్నికలలో అధిష్టానం పర్వీన్ తాజ్ పేరును పరిశీలిస్తోంది. పార్టీ కోసం పోరాడుతున్న పర్వీన్ తాజ్ కు రానున్న ఎన్నికల్లో ముస్లిం మైనటి, మహిళ కోటా కింద  సీటు ఇవ్వడం సమంజసంగా ఉంటుందని అనుచరులు కోరుతున్నారు. అధిష్టానం కూడా పర్వేన్ తాజ్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. బీసీ మహిళగా, మైనారిటీ మహిళగా తనకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *