13, డిసెంబర్ 2023, బుధవారం

జిల్లాలో రెడ్లకు మాత్రమే మళ్ళీ టిక్కెట్లు !

సగానికి పైగా MLAలకు మొండి చేయి 
మంత్రులు రోజా, స్వామి అవుట్
పుంగనూరు, పీలేరుకు పాత కాపులే 
తిరుపతి, చంద్రగిరికి వారసులు 
కుప్పం నుండి MLC భరత్ 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్ధితుల్లోనూ మరోసారి గెలుపే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. అందుకే రాష్ట్రంలో తాజా సర్వేల ఆధారంగా భారీ ఎత్తున ఇన్ ఛార్జ్ ల మార్పుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు దాదాపు 82 సీట్లలో మార్పులు చేర్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో పలు సంచలనాలు ఉన్నాయి. ఏపీలో వైసీపీ మొదట 11 అసెంబ్లీ సీట్లలో కొత్త ఇన్ ఛార్జ్ లను ప్రకటించింది. ఇందులో పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను పొరుగు నియోజకవర్గాలకు మార్చడంతో పాటు పలు చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు. అయితే ఇది మొదటి జాబితా మాత్రమేనని, త్వరలో భారీగా మార్పులు చేర్పులు ఉంటాయన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రంలో 82 సీట్లలో వైసీపీ కొత్త ఇన్ ఛార్జ్ లను ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్థానికంగా వ్యతిరేకత ఎదుర్కొంటున్న రోజాను పక్కన పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆమె సొంత పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికలలోనే స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. రోజాకు టిక్కెట్టు ఇస్తే, ఒక వర్గం పూర్తిగా వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. ఆమెను పార్టీ ప్రచారకర్తగా వాడుకోవాలనుకుంటున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యేను మార్చడం ఖాయం. అయన అవినీతి మీద ఒక ప్రముఖ దినపత్రికలో ప్రముఖంగా వార్త ప్రచురితం అయ్యింది. అవినీతి, అవకతవకలకు సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన స్థానంలో రోజా అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం ఉంది. 

డిప్యూటీ సీఎంకు నారాయణస్వామికీ టికెట్ నిరాకరిస్తున్నారు. ఆయనకు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డికి పడటం లేదు. నియోజకవర్గంలో పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒకరి మీద ఒకరు కత్తులు  దూసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నియోజకవర్గంలోని రెడ్డి సామాజికవర్గం స్వామికి పనిచేసే పరిస్థితి లేదు. పూతలపట్టు శానసభ్యుడు MS బాబుకు నియోజకవర్గంలో రోజురోజుకు అసమ్మతి పెరుతోంది. బాబుకు ఈ సారి టిక్కెట్టు ఇస్తే, పనిచేసేది లేదని అసమ్మతివాదులు తెగేసి చెపుతున్నారు. అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. అందరిని కలుపుకొని పోవడం లేదని కింద స్థాయిలో అసమ్మతి రేగింది. కొత్త అభ్యర్థి తెర మీదకు వచ్చే అవకాశం ఉంది.

చిత్తూరు నియోజకవర్గంలో కూడా మార్పు ఉంటుందని అంటున్నారు. ఇక్కడ కూడా పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. కొందరు MLA జంగాలపల్లి శ్రీనివాసులుకు అనుకూలంగా ఉంటే, మరి కొందరు RTC ఉపాధ్యక్షుడు విజయనంద రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. ఈ సారి టిక్కెట్టు తనకు కేటాయించాలని విజయనంద రెడ్డి పట్టుపడుతున్నారు. తనకు టిక్కెట్టు ఇస్తే, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల గెలుపు భాద్యత కూడా తనదే అన్నట్లు సమాచారం. విజయనంద రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో సేవా కార్యక్రమాల ద్వారా దూసుకుపోతున్నారు. జంగాలపల్లి శ్రీనివాసులు పేరును పలమనేరు నియోజకవర్గానికి పరిశీలించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

సత్యవేడులో కూడా అభ్యర్థి బలహీనంగా ఉన్నట్లు చెపుతున్నారు. మదనపల్లి, పలమనేరు MLAల పనితీరు మీద విమర్శలు ఉన్నాయి. ఆరోపణలు కూడా ఉన్నాయి. అ;లగే తంబళ్ళపల్లి MLAకు కూడా ఈ పర్యాయం టిక్కెట్టు డౌట్ అంటున్నారు. ఇలా జిల్లాలో సగానికి పైగా కాండిడేట్లు మారిపోనున్నారు. జిల్లాలో పుంగనూరు నుండి రామచంద్రా రెడ్డి, కుప్పం నుండి భరత్, పీలేరు నుండి చింతల రామచంద్రా రెడ్డి పోటి చేయడం ఖరారు. అలాగే  తిరుపతి నుండి కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, చంద్రగిరి నుండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి పోటి చేయనున్నారు. మిగిలినవి మరే అవకాశం ఉంది.


వైస్సార్సీపీ అధినేత జగన్మోహనరెడ్డి కోసం ఐపాక్ టీమ్ పనిచేస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ సంస్థ గ్రౌండ్ లెవల్లో చేసిన సర్వేల్లో పార్టీ పరిస్థితి బాగాలేదన్న రిపోర్టు వచ్చింది. కనీసం 70 స్థానాల్లో ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలింది. ఐదు చోట్ల స్థానికంగా ఉన్న గొడవలను సర్దుబాటు చేసి మిగిలిన 82 చోట్ల అభ్యర్థులను మార్చాలన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారు. ఈ నిర్ణయం జరిగి కూడా నెలరోజులకు పైగానే అవుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ సమాచారం ఎప్పుడో చేరవేశారు కూడా.. విడతల వారీగా ఇప్పుడు.. అభ్యర్థులను మారుస్తూ వస్తున్నారు. 



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *