కమ్మల ఆశాజ్యోతి మదనపల్లి
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మదనపల్లి నియోజకవర్గం ఆ పార్టీని ఎక్కువ ఎన్నికలలో ఆదరించింది. YSR కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీకి పట్టుకోమ్మగా మారింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 9 సార్లు సాధారణ ఎన్నికలు జరగకగా ఐదు సార్లు టిడిపి విజయకేతనం ఎగురవేసింది. ఈ నియోజకవర్గ నుంచి అత్యధికంగా కమ్మ సామాజిక వర్గం నేతలు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నియోజక వర్గంలో కమ్మ తర్వాత రెండుసార్లు రెడ్లు, మరో రెండు సార్లు ముస్లిం నేతలు విజయం సాధించారు. అలాగే రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ, మరో రెండు పర్యాయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రానున్న ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గం నుండి తెలుగుదేశం పార్టీ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, ముస్లిం మైనారిటీ వర్గం నుండి నాలుగు నెలల కిందట కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన మరో మాజీ MLA షాజహాన్ భాష ఆశిస్తున్నారు. అలాగే BC సామాజికవర్గం నుండి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు కూడా టికెట్ రేసులో ఉన్నారు.
1983, 1985 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాటకొండ నారాయణ రెడ్డి మదనపల్లి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1989 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆవుల మోహన్ రెడ్డి విజయం సాధించారు. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాటకొండ కృష్ణ సాగర్ రెడ్డి, 1999 ఎన్నికలలో ఆయన తమ్ముడు బాబు రెడ్డి భార్య రాటకొండ శోభ, 2004 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దొమ్మలపాటి రమేష్ విజయకేతనం ఎగురవేశారు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున షాజహాన్ భాష విజయం సాధించారు. 2014 ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, 2019 ఎన్నికలలో మహమ్మద్ నవాజ్ భాష ఎన్నికయ్యారు.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన దొమ్మలపాటి రమేష్ 2004 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీ పట్టిష్టతకు కృషి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగిన ఆందోళన కార్యక్రమాలను ముందుండిడి విజయవంతం చేస్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీలో అందరికీ సుపరిచితుడైన దొమ్మలపాటి రమేష్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువ సార్లు కమ్మ నేతలు తెదేపా నుండి విజయం సాధించారు. నియోజకవర్గంలో కమ్మ వర్గానికి మంచి పట్టు ఉంది. పార్టీకి సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు.
ముస్లిం మైనారిటీకి చెందిన షాజహాన్ భాష 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలకు కొంత విరామం ఇచ్చి, నాలుగు నెలల కిందట లోకేష్ ఆధ్వర్యంలో యువగళం పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ ఆందోళన కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. మదనపల్లెలో రెండుసార్లు మైనార్టీ అభ్యర్థులు విజయం సాధించిన దాఖలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించగలిగే శక్తి మైనారిటీలకు ఉంది. తనకు రాజకీయ అనుభవం కూడా ఉన్న కారణంగా ఈ పర్యాయం మైనారిటీ కింద తనకు టికెట్ను తనకి కేటాయించాల్సిందిగా కోరుతున్నారు.
మదనపల్లి నీరుగట్టువారిపల్లికి చెందిన శ్రీరామ్ చినబాబు తొగట చేనేత కుటుంబానికి చెందినవారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా అంచలంచెలుగా ఎదిగారు. ఆయన సామాజిక వర్గ ఓట్లు నియోజకవర్గంలో గణనీయంగా పైగా ఉన్నాయి. అది కాకుండా నియోజకవర్గంలో బీసీల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. బీసీ ఓట్లతో పాటు బలిజ సామాజిక ఓట్లు కూడా తనకు లభిస్తాయని చిన్న బాబు ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ బీసీ సామాజిక వర్గానికి కేటాయించలేదు. ఈ పర్యాయం బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తే, ఘన విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు.
వీరితోపాటు 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాటకొండ కృష్ణ సాగర్ రెడ్డి తమ్ముడు బాబు రెడ్డి కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ టికెట్లను ఆశిస్తున్నారు. ఆయన భార్య రాటకొండ శోభ 1999 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మదనపల్లి నుంచి విజయం సాధించారు. రాజకీయ నేపథ్యమున్న తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.