అత్యంత వైభవంగా జగన్ జన్మదిన వేడుకలు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం చిత్తూరులో అత్యంత వైభవంగా జరిగాయి. ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయనంద రెడ్డి, చిత్తూరు శాసనసభ్యుడు ఆరణి శ్రీనివాసులు పోటీలు పడి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాలను నిర్వహించారు.
తిరుపతి రోడ్డులోని అయ్యప్ప నగర్ లో జరిగిన కార్యక్రమంలో విజయానంద రెడ్డి 53,000 మంది డోక్రా మహిళలకు చీరలు, వారి కుటుంబ సభ్యులకు ప్యాంట్లు, షార్టులు అందజేశారు. తొలుత భారీ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు సభ్యుడు రెడ్డెప్ప, జిల్లా పరిషత్తు చైర్మన్ గోవింద శ్రీనివాసులు, చిత్తూరు మున్సిపల్ చైర్మన్ ఆముద, డెప్యూటీ మేయర్ రాజేష్ కుమార్, చిత్తూరు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రమ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమనికి నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. సభాప్రాంగణం మహిళలతో నిండిపోయింది. డ్వాక్రా మహిళలకు ముందుగానే టోకన్లు అందచేశారు. వాటిని తీసుకెళ్లి వస్త్రాలు తీసుకున్నారు. సభాప్రాంగణంలో ఒక దశలో తొక్కిసలాట కూడా జరిగింది. ఒకరు గాయపడ్డారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా చిత్తూరు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు ఉదయం గిరింపేట మున్సిపల్ హైస్కూల్ నందు విద్యార్థులకు ట్యాబ్ పంపిణీ చేశారు. సాంబయ్య ఖండ్రిగలో పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తపోవనం వృద్ధాశ్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ సంతోష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, అన్నదానం చేశారు.
మధ్యాహ్నం ఎమ్మెస్సార్ సర్కిల్ లో స్టేట్ మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ బుల్లెట్ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కేక్ కటింగ్ లో పాల్గొని, అన్నదానం చేశారు. గాంధీ సర్కిల్ నందు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రాజారెడ్డి, చైర్మన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కు హాజరయ్యారు. అన్నదానం చేశారు. ఎస్టేట్ కోర్టు దగ్గర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్, నగర అధ్యక్షుడు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి, అన్నదానం ప్రారంభించారు.
వైఎస్ఆర్సిపి నాయకుడు భూపేష్ గోపీనాథ్ ఆధ్వర్యంలో సంతపేటలో ఏర్పాటుచేసిన కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు కో ఆప్షన్ నెంబర్లు, వైఎస్ఆర్సిపి ఇన్చార్జిలు, వైఎస్ఆర్సిపి నాయకులు, మండల అధ్యక్షులు, జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
పూతలపట్టులో ...
జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం పూతలపట్టు సచివాలయం -1లో జరిగాయి. పూతలపట్టు నియోజకవర్గం పియస్.ఆర్ అభిమానులు అద్వర్యంలో పూతలపట్టు లెజెండ్రీ లీడర్ దివంగత నేత సుబ్బారెడ్డి సతీమణి పూతలపట్టు గౌహతి సుబ్బారెడ్డి సమక్షంలో ముఖ్యఅతిథిగా హాజరైన మహిళా శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజినల్ చైర్ పర్సన్ శైలజ చరణ్ రెడ్డి పాల్గొన్నారు.