చంద్రగిరి టిక్కెట్టు రేసులో ఇందుశేఖర్
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి యువనేత కొల్లూరు ఇందుశేఖర్ తెలుగుదేశం పార్టీ టికెట్ రేసులో ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ పరిశీలిస్తోంది. ఆయన మాజీ ఎమ్మెల్యే మేడసాని వెంకట్రామా నాయుడు మనవడు. తిరుపతి రురల్ మండలానికి చెందిన వ్యాపారవేత్త. ఆయనకు పార్టీ నాయకులతో, చంద్రబాబు కుటుంబ సభ్యలతో సన్నిహిత సంబంధం ఉన్నాయి. ఆర్థిక పరిపుష్టి కలిగిన యువనేత.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో 1983 ఎన్నికలలో మేడసాని వెంకట్రామా నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రగిరి నియోజకవర్గo నుండి గెలుపొందారు. ఆయన మనవడు ఇందుశేఖర్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశిస్తున్నారు. ఇందుశేఖర్ కు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఇందుశేఖర్ ఆర్థిక పరిపుష్టి కలిగి ఉన్నారు. ఆయనకు తిరుపతి రూరల్, పాకాల, చంద్రగిరి మండలాల్లో బంధువర్గం వుంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొమ్మిది సార్లు చంద్రగిరి నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల జరిగితే మూడుసార్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఆరుసార్లు ఇతర పార్టీలు విజయం సాధించాయి. చంద్రగిరిలో తెదేపా ఓటమి చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా మారింది. ఇతర పార్టీల నేతలు సొంత నియోజకవర్గంలో చంద్రబాబుకు పెట్టలేదని విమర్శిస్తుంటారు. కావున ఆ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలంటే సరైన అభ్యర్థి ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి సత్తా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కావున రానున్న ఎన్నికలలో తనకు టికెట్ ఇస్తే ప్రస్తుత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని దీటుగా ఎదుర్కొని, పార్టీని విజయపదంలో నడిపిస్తానని ఇందుశేఖర్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.