8 నుండి అంగన్వాడిల నిరవదిక సమ్మె
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయకపోవడంతో అనివార్య పరిస్థితుల్లో 8 నుంచి సమ్మె చేస్తున్నారని వారి సమస్యలు పరిష్కారం చేసే విధంగా ఆలోచనలు కల్పించే కల్పించాలని డాక్టర్ బి.ఆర్ 63వ వర్ధంతి సందర్భంగా చిత్తూరులో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, వినత పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా ఏపి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కే సురేంద్రన్, ఏ ఐ టి యు సి జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి చంద్ర ,రమాదేవి, సిఐటియు అనుబంధ సంఘం అంగన్వాడి యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షకీలా, జిల్లా ఉపాధ్యక్షురాల సుజిని, ఏఐటీయూసీ అనుబంధ సంఘం అంగన్వాడి జిల్లా కార్యదర్శి ప్రేమ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను ఎలా భగ్నం చేయాలని అధికారులతో ఒత్తిడి చేస్తున్నదే తప్ప సమస్యలు ఎలా పరిష్కారం చేద్దామనే ఆలోచనలో లేకపోవడం దుర్మార్గమన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో మోపిన సందర్భంలో ఆ ప్రభుత్వాలను ఇంటికి పంపించిన చరిత్ర అంగన్వాడీలకు ఉందని, ఈ ప్రభుత్వం దానిని మర్చిపోవద్దని హెచ్చరించారు.
ప్రభుత్వం అధికారులు ఎన్ని నిర్బంధాలు విధించినా ఎనిమిది నుండి నిరవదిక సమ్మె జరిగి తీరుతుందని దాని ఆపడం ఎవరితరం కాదని హెచ్చరించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మెకు సహకరించాలని బెదిరింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యను పరిష్కారం చేస్తే సమ్మె చేసే పరిస్థితి లేదు కదా అని వారు తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చనిపోయి 63 సంవత్సరాలు అవుతున్న ఆయన రచించిన రాజ్యాంగంపై నిరంతరం దాడి జరుగుతున్నదని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం అందరపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటీయూసీ అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

