ప్రముఖ సినీనటి జయప్రద మిస్సింగ్
ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ, బిజెపి నాయకురాలు జయప్రద కనిపించడం లేదు. జయప్రద మిస్సింగ్ అని పోలీసులు ప్రకటించారు. ఆమె ఆచూకీ కనుకొనడానికి ఉత్తరప్రదేశ్ పోలీసులు ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. ఆమెను అరెస్టు చేయడానికి ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇందుకు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ వార్త సామాజిక మాధ్యమాలల్లో వైరల్ అవుతోంది.
2019 సంవత్సరంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఏప్రిల్ 19వ తేదీన ఆమె యూపీ ఈశ్వర్ మున్సిపల్ లోని ఒక గ్రామంలో రోడ్డును ప్రారంభించారు. అలాగే పిప్లియ మిశ్రా గ్రామంలో జరిగిన ఒక బహిరంగ సభలో అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయమై కోర్టులో ఆమె మీద కేసు దాఖలు అయ్యింది. విచారణకు రావాలని న్యాయమూర్తి ఎన్నిసార్లు ఆదేశించినా, ఆమె హాజరు కాలేదు. దీంతో ఆమెపై కోర్టు నాన్ బెలబుల్ వారింట్ ను జారీ చేసింది. జనవరి 20లోపు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు జయప్రదను అరెస్ట్ చేయడానికి రెడి అయ్యారు.ఈ విషయం తెలియగానే ఆమె అజ్ఞాతంలోకి వెళ్ళిపోయరు. దీంతో పోలీసులు ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి జయప్రద కోసం గాలిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నటి జయప్రద ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణా వంటి స్టార్ హీరోల సరసన నటించారు. ఆనాటి తరానికి ఆమె ఓ కలల రాణి. ఆమె కారణంగానే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి అంటే అతిశయోక్తి కాదు. తెలుగు నుంచి హిందీ సినీ పరిశ్రమకు మారిన జయప్రద అక్కడ కూడా సినీ సామ్రాజ్యాన్ని ఏరారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు.
అనంతరం సమాజవాదీ పార్టీలో చేరి, ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆమె ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ నియోజకవర్గం నుండి 2004 ఎన్నికలలో ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. బిజెపి నుండి అదే రాంపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆమె బిజెపి నాయకురాలుగా కొనసాగుతున్నారు.