టీడీపీదే అధికారం అన్న చాణక్య స్ట్రాటజీస్ సర్వే
టీడీపీ, జనసేన కూటమి 115 నుంచి 128 సీట్లు
అధికార వైసీపీ 42 నుంచి 55 సీట్లు
18 సీట్లలోనే హోరాహోరీ పోరు
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ సీట్లపై గత కొన్ని రోజులుగా తమ సంస్థ చేసిన సర్వే ఫలితాలను చాణక్య స్ట్రాటజీస్ శనివారం వెల్లడించింది. ఈ సర్వేతో తెదేపా, జనసేన కూటమికి తీపి కబురు చెప్పింది. అధికార పార్టీకి పరాజయం తప్పదని పేర్కొంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం టీడీపీ, జనసేన కూటమి ఏకంగా 115 నుంచి 128 సీట్లు గెల్చుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అధికార వైసీపీ కేవలం 42 నుంచి 55 సీట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని చెప్పింది. రాష్ట్రంలో మొత్తంగా 18 సీట్లలోనే హోరాహోరీ పోరు ఉన్నట్లు ఈ సర్వే వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కాకుండా ఇతరులకు 4 నుంచి 7 సీట్లు దక్కే అవకాశం ఉందని పేర్కొంది. పార్టీల వారీగా ఓట్ల శాతం చూసుకుంటే టీడీపీకి 43, వైసీపీకి 41, జనసేనకు 10, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పింది.
చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం ఉమ్మడి జిల్లాల వారీగా చూసుకుంటే చిత్తూరు జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ,జనసేన కూటమికి 7, వైసీపీకి 5, మరో రెండు సీట్లలో హోరాహోరీ పోరు ఉంది. కర్నూలు జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 5, వైసీపీకి 7, మరో 2 సీట్లలో హోరాహోరీ ఉంతుంది. అనంతపురం జిల్లాలోని 14 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 10, వైసీపీకి 3 సీట్లు వస్తాయి. ఒక సీటులో గట్టిపోటీ ఉంది.
కృష్ణాజిల్లాలో 16 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 12, వైసీపీకి 2, మరో రెండు సీట్లలో గట్టిపోటీ ఉండచ్చు. గుంటూరు జిల్లాలో 17 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 12, వైసీపీకి 2, మరో 2 సీట్లలో గట్టిపోటీ ఉంటుంది. ప్రకాశం జిల్లాలోని 12 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 8, వైసీపీకి 3, ఓ సీటులో హోరాహోరీ పోరు తప్పదు. నెల్లూరు జిల్లాలోని 10 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 6, వైసీపీకి 3, ఓ సీటులో గట్టి పోటీ ఉంటుంది. కడప జిల్లాలోని 10 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 4, వైసీపీకి 4, మరో రెండు సీట్లలో హోరాహోరీ పోరు తప్పదు.
శ్రీకాకుళంలో పది సీట్లకు టీడీపీ, జనసేన కూటమికి 8, వైసీపీకి 2 సీట్లు వచ్చే అవకాశం ఉంది. విజయనగరంలోని 9 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 4, వైసీపీకి 4 సీట్లు, ఓ సీటులో హోరాహోరీ పోరు ఉండచ్చు. విశాఖపట్నం జిల్లాలోని 15 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 11 సీట్లు, వైసీపీకి 2 సీట్లు రావచ్చు. మరో 2 సీట్లో హోరాహోరీ ఉంటుందని చెప్పింది. తూర్పుగోదావరిలో 19 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 16 సీట్లు వైసీపీకి 2 సీట్లు, ఓ సీటులో హోరాహోరీ పోరు ఉంటుందని పేర్కొంది. పశ్చిమగోదావరిలో 15 సీట్లలో టీడీపీ, జనసేన కూటమికి 12, వైసీపీకి 2 సీట్లు, ఓ సీటులో మాత్రం గట్టిపోటీ ఉంటుందని చాణక్య స్ట్రాటజీస్ సర్వే వెల్లడించింది.