8, జనవరి 2024, సోమవారం

టీడీపీ జిల్లా అధ్యక్షుడు నాని ఆత్మహత్యాయత్నం !

దొంగ, బోగస్ ఓట్లు తొలగించాలని నాని నిరాహార దీక్ష
ఆమరణ దీక్షగా మారుస్తున్నట్లు ప్రకటన 
అరెస్టుకు పోలీసుల యత్నం 
వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం
తిరుపతి స్విమ్స్ కు తరలించిన పోలీసులు 
నానికి పలువురు తెదేపా నాయకుల పరామర్శ 


దొంగ, బోగస్ ఓట్లు తొలగించాలని చంద్రగిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ధర్నాను ప్రారంభించి,  ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.  దీంతో  నానిని  అరెస్ట్ చేసి, దీక్షను భగ్నం చేయడానికి  పోలీసులు ప్రయత్నం చేశారు. ఇందుకు నిరసనగా నాని  వంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నం చేశారు. దిమ్య్తో పోలీసులు  పులివర్తి నాని పై నీళ్లు పోసి అదుపులోకి తీసుకున్నారు. తోపులాటలో పెట్రోల్ కళ్లలో పడటం, తీవ్ర అస్వస్థత గురయ్యారు. వెంటనే, టీడీపీ నాయకులు పోలీసులు తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ కు తరలించారు.  స్విమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నానిని పలువురు తెదేపా నాయకులు పరామర్శించారు.


 దొంగ, బోగస్ ఓట్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు తెదేపా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జి పులివర్తి నాని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్ డి ఓ కార్యాలయం ఎదుట సోమవారం  ఈ మేరకు  ధర్నాను ప్రారంభించారు. భారీ వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా నానీ మాట్లాడుతూ.... ఒక వ్యక్తి రెండు ప్రాంతాల్లో ఓట్లు నమోదు చేశారని ఆరోపించారు. వలస వచ్చిన వారి ఓట్లు భారీగా నమోదు చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చంద్రగిరిలో భారీగా నమోదైన దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. 7 నెలలుగా పోరాటం చేస్తున్నా  అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తూ కూర్చోవడం న్యాయం కాదన్నారు. కట్టలు కట్టలుగా ఆధారాలను సమర్పించిన ఫలితం శూన్యం అని ఆవేదన వ్యక్తంచేశారు. బోగస్, దొంగ ఓట్లు తొలగించేంత వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆమరణ నిరాహార దీక్ష అని ప్రకతిమ్చాతంతో, పోలీసులు జోక్యం చేసుకున్నారు. 

పోలీసుల వైఖరిని ఖండించిన జిల్లా పార్టీ నాయకులు
చిత్తూరు పార్లమెంటు పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటర్ల జాబితాలోని దొంగ ఓట్లు తొలగించలేదని శాంతియుతంగా ఆర్డిఓ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే అధ్యక్షుడు భగ్నం చేయడాన్నిజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. రాష్ట్ర పార్టీ కార్యదర్శి సురేంద్ర కుమార్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ , జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజు, రాష్ట్ర బీసీల అధికార ప్రతినిధి వెంకటేష్ యాదవ్, చిత్తూరు జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు త్యాగరాజు, చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు ప్రభు తేజ,  పూతలపట్టు బిసి సెల్ అధ్యక్షులు ధరణి ప్రకాష్, ఒక ప్రకటన విడుదల చేస్తూ.. గతంలో జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్లో  దొంగ ఓటును తయారుచేసి ఇతర ప్రాంతాల నుండి యాత్రికుల పేరుతో తిరుపతి ప్రాంతానికి రప్పించి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నికల నియమా వాళ్ళకి వ్యతిరేకంగా వైసిపి పార్టీ వారు దొంగ ఓట్లు పోల్ చేపిచ్చి ఎన్నికల్లో గెలవడం జరిగిందన్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *