అంగన్వాడీల పోరాటం చారిత్రాత్మక విజయం
విజయోత్సవ సభలో యూనియన్ గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజు
42 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విరోచితమైన సమ్మె చేసి అనేక విజయాలు సాధించిన సందర్భంగా శుక్రవారం కార్వేటినగరం ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో విజయోస్తవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ 42 రోజులు కాలంలో ప్రభుత్వము, అధికారులు అనేక రకాల అవరోధాలు సృష్టించినప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా పోరాటం చేసిన అంగన్వాడీల అందరిని ఆయన అభినందించారు. మరోసారి అంగన్వాడీల ఐక్యత చాటి చెప్పారు.
తాళాలు పగలగొట్టిన నోటీసులు ఇచ్చిన టెర్మినేషన్ చేసిన ఏమాత్రం లెక్క చేయకుండా కలెక్టరేట్ ముట్టడి మరియు చలో విజయవాడ లాంటి విరోచితమైన పోరాటాలు చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి మొదట నాలుగు సార్లు చర్చలు జరిపిన సందర్భంగా ఎలాంటి రాతపూర్వక హామీ ఇవ్వలేదు .అయితే చివరికి ప్రధానమైన మూడు డిమాండ్లు కనీస వేతనాలు, మినీ సెంటర్ మెయిన్ సెంటర్ లుగా మార్చడం, గ్రాట్యుటీ లాంటి సమస్యలపై రాతపూర్వకంగా ఇస్తామని ఒప్పందం కుదరడంతో సమ్మె విజయవంతమైందని ఆయన తెలిపారు. పోరాటం విజయవంతమైన తర్వాత అంగన్వాడి ఉద్యమంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీని మానుకుంటే వారికి మంచిదని హెచ్చరించారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రత్యక్షంగా అంగన్వాడి ఉద్యమంలో వర్కర్స్ పాల్గొన్న వారందరికీ నిజా నిజాలు ఏంటో అర్థం అయిందన్నారు. ఇప్పటికే అనేక రకాల కుట్రలను అధిగమించి పోరాటంలో భాగస్వాములైనరని వారికి అబద్ధాలు చెప్తే వినే పరిస్థితిలో లేరని తెలిపారు. సూర్యకాంతిని అరిచే అరచేతి ఎలా ఆపలేరు అబద్ధాలు పరిస్థితి కూడా అదేనని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికైనా అంగన్వాడీ ఐక్యతను గుర్తించి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఒప్పందంలో కక్ష్య సాధింపు చర్యలు ఉండవని స్పష్టంగా చెప్పిన అధికారులు అక్కడక్కడ పాల్పడే విధంగా వ్యవహరిస్తున్నారని వీటిని మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధ్యక్షురాలు లక్ష్మీనరసమ్మ అధ్యక్షత వహించగా కార్యదర్శి మమత మాట్లాడుతూ ఇదే పద్ధతిలో ప్రాజెక్టులో భవిష్యత్తులో కూడా ఐక్యతగా ఉండాలని ఇలాంటి సమస్యలు వచ్చినా కమిటీ హామీ ఇచ్చారు.ఇంకా నాయకులు రాని,బాను లతోపాటు అంగన్వాడీలు పాల్గొన్నారు