మూడు కేసుల్లో బాబుకు బెయిలు
తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోర్టు కేసులలో భారీ ఊరట లభించింది. ఆయనకు మూడు కేసుల్లో ఏక కాలంలో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ధర్మాసము తీర్పు వెలరించింది. చంద్రబాబుతో పాటు మాజీమంత్రి, టిడిపి బీసీ నేత కొల్లు రవీంద్ర, పదవి విరమణ చేసిన ఐఏఎస్ అధికారి నరేష్ కూడా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ వర్గాలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు మరింత ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి అవకాశం కలిగిందని తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆనందపడుతున్నారు.
ఏపీ సిఐడి పోలీసులు చంద్రబాబు మీద వరస కేసులను నమోదు చేశారు. చంద్రబాబును మరింత కాలం రాజమండ్రి కేంద్ర కార్యాలయంలోనే ఉంచడానికి పధక రచన చేశారు. ఇందులో భాగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందని గతంలోనే కేసును నమోదు చేసిన కేసులు, చంద్రబాబు నాయుడు ను ఏ3 గా చేర్చారు. అలాగే కంపెనీలను నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం కంపెనీలకు అనుమతులు మంజూరు చేశారని మరో కేసును నమోదు చేసింది. ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇస్తూ మంత్రివర్గ సమావేశం తీసుకొని నిర్ణయంపైన కూడా సిఐడిఐ అధికారులు కేసును నమోదు చేశారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని, ఆర్థికంగా రాష్ట్రం నష్టపోయిందని అభియోగాలను చంద్రబాబు మీద మోపారు. ఈ మూడు కేసులపై తనకు బెయిలు మంజూరు చేయాల్సిందిగా చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సుదీర్ఘంగా వాదోపవాదాలు జరిగాయి. చివరకు బుధవారం మూడు కేసుల్లోనూ చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ అదేశాలను జారీ చేసింది. అయితే చంద్రబాబు ఈ కేసుల గురించి మీడియాతో మాట్లాడకూడదని షరతు విధించింది. అలాగే సిఐడి పోలీసులు చంద్రబాబును ఈ విషయంలో ప్రశ్నించాలి అనుకుంటే నిర్దిష్ట కాల పరిమితితో కూడిన నోటీసులను ముందుగా జారీ చేయాలను కూడా హైకోర్టు పేర్కొంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో కూడా సుప్రీంకోర్టులో వాదపవాదాలు, విచారణ పూర్తయినట్టు తెలిసింది. సుప్రీం కోర్ట్ తుది తీర్పును రిజర్వు చేసినట్లు సమాచారం. మరో వారం రోజుల్లో క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించే అవకాశం ఉందని న్యాయవాదులు భావిస్తున్నారు.

