16, జనవరి 2024, మంగళవారం

శ్రీ వీరభద్రస్వామికి ప్రధాని నరేంద్ర మోడీ హారతి


లేపాక్షిలోని ప్రాచీన శ్రీ వీరభద్ర స్వామి వారి ఆలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సందర్శించారు. ప్రధాని శ్రీ వీరభద్రస్వామికి  సప్తఋషి హారతిని ఇచ్చారు. ప్రధానికి ఆలయ  అర్చకులు, జిల్లా అధికారులు, పురావస్తు శాఖ సిబ్బంది స్వాగతం పలికారు, ప్రధాని వెంట రాష్ట్ర గవర్నర్ జస్టిస్ నసీర్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.



ఈ సందర్భంగా ప్రధాన నరేంద్ర మోడీ శ్రీ వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. మూల విరాట్ కు హారతి ఇచ్చారు. అనంతరం వేద పండితులు మోడీకి వేద ఆశీర్వాదం పలికే చేశారు. స్వామివారి శేష వస్త్రాన్ని బహూకరించారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ 40 నిమిషాల పాటు ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీకి అక్కడి అర్చకులు లేపాక్షి ఆలయ చరిత్ర, దానికున్న విశిష్టతను వివరించారు. ఏక రాతితో నిర్మించిన మహాశివుని విగ్రహం చూసి మోడీ పరవశించి పోయారు. 

ఆలయ ప్రాంగణంలో ఉన్న వేలాడే స్తంభాన్ని ఆసక్తిగా తిలకించారు. ఆలయ ప్రాముఖ్యత, శిల్పకళా సంపద, దేవాలయ నిర్మాణం తదితర వివరాలను ఆలయ అధికారులు మోడీకి వివరించారు. 

ఈ ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ప్రధాని రాక సందర్భంగా లేపాక్షి ఆలయాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

జంగమ దేవరులకు ఎంతో ఇష్టమైన, కుల దైవం, పూజనీయమైన వీరభద్ర స్వామి ఆలయాన్ని ప్రధాని మోడీ సందర్శించడం పట్ల రాష్ట్ర జంగం సంక్షేమ సంఘం అధ్యక్షుడు సాటి గంగాధర్ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ భక్తిని  కొనియాడారు. రాష్ట్ర జంగమల తరఫున ప్రధాన మోడీకి అభినందనలు తెలియజేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *