12, జనవరి 2024, శుక్రవారం

స్వామి పార్లమెంటుకు - రెడ్డెప్ప అసెంబ్లీకి !?


చిత్తూరు పార్లమెంటు పరిదిలోనూ తిరుపతి ఫార్ములా ప్రయోగించాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలోచిస్తున్నారని సమాచారం. చిత్తూరు ఎంపి ఎన్. రెడ్డప్పకు జి డి నెల్లూరు అసెంబ్లీ టికెట్టు, అక్కడి ఎమ్మెల్యే, మంత్రి  కె నారాయణ స్వామికి చిత్తూరు లోక్ సభ టికెట్టు ఇవ్వాలని చూస్తున్నారు. ఆ మేరకు రెండు రోజులుగా మండల కన్వీనర్లు, కీలక నేతల అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు. 

జి డి నెల్లూరు నియోజక వర్గంలోని ఆరు మండలాల కన్వీనర్లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినట్టు తెలిసింది. రెడ్డప్ప ఎవరికి అందుబాటులో ఉండరని, ఏది అడిగినా ఎంపీ మిథున్ రెడ్డిని అడగమంటారని  అంటున్నారు. ఇక ఆయనకు ఓట్లు వేస్తే పనులకోసం పుంగనూరు వెల్లాలా అంటూ ప్రశ్నించారని తెలిసింది. ప్రభుత్వ సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్ర రెడ్డి మాటవిని నారాయణ స్వామికి అన్యాయం చేస్తే టిడిపి అభ్యర్థి గెలుపు సులభం అవుతుందని కూడా కొందరు చెప్పినట్టు తెలిసింది. 1994లో  కూడా జ్ఞానేంద్ర మాట విని డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మకు టికెట్టు నిరాకరించి, నష్ట పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శోభాపై టిడిపి అభ్యర్థి ఆర్ గాంధీ విజయం సాధించారు. జ్ఞానేంద్ర రెడ్డి పలుకుబడి కేవలం పెనుమూరుకు మాత్రమే పరిమితమని అంటున్నారు. ఆయన వ్యతిరేకంగా పనిచేస్తే 500 నుంచి 100 వోట్లు నష్టం రావచ్చని, అయితే టిడిపిలో ఉన్న ఆయన వ్యతిరేకులు స్వామికి సాయం చేస్తారని వివరించారు. ఈ నేపథ్యంలో జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.


కొనేటికి ప్రమోషన్ - మద్దెలకు డిమోషన్

జగన్ తిరుపతి ఎంపి మద్దెల  గురుమూర్తిని సత్యవేడు అసెంబ్లీ అభ్యర్ధిగా, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలాన్ని తిరుపతి లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. గురుమూర్తి 2021లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రి పనపాక లక్ష్మిపై 2,71,592 ఓట్ల మెజారిటీ సాధించారు. 2019 ఎన్నికల్లో  గెలిచిన బల్లి దుర్గా ప్రసాద రావు మరణం వల్ల మధ్యంతర ఎన్నికలు జరిగాయి. దుర్గాప్రసాద్ టిడిపి అభ్యర్ధి పనపాక లక్ష్మిపై 2,28,376 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మధ్యంతర ఎన్నికల్లో గురుమూర్తికి టికెట్టు ఇచ్చినప్పుడు చాలా విమర్శలు చేశారు. ఫిజియో థెరపిస్టు అయిన ఆయన జగన్ కు మసాజ్ చేసే వారు, జగన్ కాళ్ళు పట్టినందుకు టికెట్టు ఇచ్చారంటూ అవహేళన చేశారు. అయితే ఆయన అనూహ్య మెజారిటీ సాధించారు. తరువాత ఆయన వివాదరహితుడు, మంచి నాయకుడు అన్న పేరు తెచ్చుకున్నారు. 


కోనేటి ఆడిమూలం 2019 ఎన్నికల్లో సత్యవేడు వైసిపి అభ్యర్థిగా పోటీచేసి, టిడిపి అభ్యర్థి జేడీ రాజశేఖర్ పై 44,744 ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే నియోజక వర్గంలో కొంత చెడ్డపేరు తెచ్చుకున్నారు. ప్రజల్లో ఆయనకు పలుకుబడి తగ్గినట్లు సర్వేలలో వెల్లడి అయినట్టు తెలిసింది. పైగా అక్కడ టిడిపి విజయావకాశాలు మెరుగు అయ్యాయని అంటున్నారు. దీనితో  మంచి పేరున్న గురుమూర్తిని సత్యవేడు నియోజకవర్గంలో పోటీ చేయించాలని జగన్ భావించారని తెలిసింది. అయితే చెడ్డ పేరు ఉన్న ఆదిమూలం కోసం మంచి పేరున్న గురుమూర్తిని బలిచేయడం ఏమిటని పార్టీ వర్గాలు చర్చ లేవదీశారు. జగన్ ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోవాలని పలువురు కార్యకర్తలు కోరుతున్నారు. లేకపోతే  పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అంటున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *