చిత్తూరుకు త్వరలో బుల్లెట్ ట్రైన్ !
త్వరలోనే చిత్తూరుకు బుల్లెట్ ట్రైన్ రానంది. పట్టణవాసులు బుల్లెట్ఈ ట్రైన్ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ మేరకు నేషనల్ హై స్పీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు పనులను ముమ్మరం చేశారు. ఈ బుల్లెట్ ట్రైన్ చెన్నై నుంచి కర్ణాటకలో ఉన్న మైసూర్ కు నడపనున్నారు. మూడు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ 435 కిలోమీటర్ల మేర ట్రాక్ వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి, బుల్లెట్ ట్రైన్ పూర్తిగా ఫ్లై ఓవర్ మీద నిర్మించిన ట్రాక్ మీదనే వెళ్ళనుంది. చిత్తూరు వాసులకు గుడిపాల మండలం 189 రామాపురం వద్ద స్టాప్ ను ఏర్పాటు చేయనున్నారు.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ 340 గ్రామాల మీదుగా బుల్లెట్ ట్రైన్ రాకపోకలు కొనసాగనించనుంది. చెన్నై నుంచి మైసూర్ కు రైలులో వెళ్లాలంటే సుమారుగా 10 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ ట్రైన్ లో అయితే రెండు గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణానికి గుడిపాల మండలంలోని రైతులతో భూసేకరణ నిమిత్తం రైల్వే శాఖ అధికారులు గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. భూములు ఇచ్చిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలను కూడా ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. 189 కొత్తపల్లిలో స్టాపింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో చిత్తూరు వాసులు బుల్లెట్ ట్రైన్ సేవలను వినియోగించుకునే అదృష్టం కలగనంది.
బుల్లెట్ ట్రైన్ జిల్లాలో 41 గ్రామాల మీదుగా ప్రయాణం చేయనుంది. 18 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్ నిర్మించడానికి డిజైన్ రూపొందించారు. హైదరాబాద్ కు చెందిన ఒక సంస్థ సాటిలైట్, ల్యాండ్ సర్వేలను పూర్తి చేసింది. ఈ ట్రైన్ 750 మంది ప్రయాణికులతో గంటకు 250 నుంచి 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. భూములు కోల్పోయిన రైతులకు మార్కెట్ విలువ కంటే ఐదు రెట్లు అదనంగా పరిహారం ఇస్తామని అధికారులు తెలిపారు. కొంతమంది రైతులు ఎకరాకు 50 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. మామిడి, కొబ్బరి చెట్లు ఉంటే ఒక్కొక్క చెట్టుకు 70 వేలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.