3, జనవరి 2024, బుధవారం

వైసిపికి బలిజ సామాజికవర్గం రాం.. రాం..



బలిజ సామాజిక వర్గం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై  ఆ సామాజిక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. రానున్న ఎన్నికలలో వైసీపీ వైసీపీకి బలిజ సంఘ నేతలు ఎవరు పనిచేయకూడదని, అలాగే ఓట్లు వేయకూడదని భావిస్తున్నారు. వైసిపి పార్టీ పదవుల్లో ఉంటే రాజీనామా చేయించాలని నిర్ణయించారు. భారీ ఎత్తున బలిజ నాయకులు విజయవాడ వెళ్లి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నారు. అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ కలిసి తమ మద్దతు తెలియజేయాలని భావిస్తున్నారు.


గత ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ స్థానాన్ని బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులకు కేటాయించారు. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. రానున్న ఎన్నికల్లో జంగాలపల్లి శ్రీనివాసులును పక్కన పెట్టి, ఆర్టీసీ ఉపాధ్యక్షుడు విజయానంద రెడ్డికి టికెట్టు ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో జిల్లాలోని బలిజ నేతలు తీవ్ర అసంతృప్తి గురవుతున్నారు. తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు పట్టణంలోని బలిజ సంఘం నేతలు అత్యవసర రహస్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సెల్ ఫోన్ లను అనుమతించలేదు. ఫోటోలు తీయడానికి కూడా ఎవరిని అనుమతించలేదు. ఈ సమావేశంలో బలిజ సామాజిక వర్గానికి వైసీపీ చేస్తున్న అన్యాయాన్ని ముఖ్యంగా చర్చించినట్లు తెలుస్తుంది. 

ఈ సమావేశంలో పాల్గొన్న బలిజ సంఘం నేతలు ఓ యం రాందాసు, సుబ్రహ్మణ్యం, ఆరని బాలాజీ, తుకారం, నరసింహులు, రమణల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైసిపి, తెలుగుదేశం, జనసేన పార్టీలకు సంబంధించిన బలిజ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా వైసిపికి దూరంగా ఉండాలని బలిజ సంఘం నేతలు నిర్మానించారు. ఎవరైనా పార్టీ పదవుల్లో ఉంటే రాజీనామా చేయించాలని నిర్ణయించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తరఫున పని చేయకూడదని, తమ సామాజిక వర్గం ఎవరూ ఓట్లు వేయకుండా జిల్లా అంతటా తిరిగి చైతన్య పరచాలని నిర్ణయించారు.

జిల్లా నుంచి 500 మంది ప్రతినిధులు బయలుదేరి విజయవాడ వెళ్లి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి తమ మద్దతు ప్రకటించాలని నిర్ణయించారు. అలాగే నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం లేక జనసేన పార్టీలలో చేరాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో చిత్తూరు నుంచి బలిజ సామాజిక వర్గం అభ్యర్థిని పోటీలో నిలపాలని కోరనున్నారు. ముఖ్యంగా మాజీ పార్లమెంటు సభ్యుడు పారిశ్రామికవేత్త డికే ఆదికేశవులు కుమారుడు డిజె శ్రీనివాసులు పేరును ప్రతిపాదించాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆయనకు ఆసక్తి లేకపోతే బలిజ సామాజిక వర్గంలోనే మరో మరొకరికి అవకాశం కల్పించాలని కోరనున్నారు. ఏది ఏమైనా జిల్లా కేంద్రంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బలిజ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేయాలని కోరనున్నారు. తాము దగ్గరుండి అభ్యర్థులు గెలిపించుకొని పార్టీకి కానుకగా ఇస్తామని ఆమె ఇవ్వనున్నారు.

 ఈ నేపథ్యంలో వరుస భేటీలు జరుగుతున్నాయి. జిల్లా బలిజ సంఘం నేతలు జిల్లా వ్యాప్తంగా పర్యటించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్య పట్టణాలలో సమావేశాలు ఏర్పాటు చేసి బలిజ సామాజిక వర్గాన్ని వైసీపీకి వ్యతిరేకంగా చైతన్యం చేయాలని భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బలిజ సామాజిక వర్గం వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. జిల్లాలో బలిజ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. గత ఎన్నికలలో తిరుపతి, చిత్తూరు అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ బలిజ సామాజిక వర్గానికి కేటాయించింది. అలాగే చిత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా కూడా బలిజ సామాజిక వర్గానికి చెందిన కాజూరు బాలాజీని నియమించింది. తెలుగుదేశం పార్టీ ప్రతి ఎన్నికలలో తిరుపతి, చిత్తూరు అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటును కూడా బలిజ కులస్తులకే కేటాయించింది. ఈ నేపథ్యంలో మళ్లీ బలిజ సామాజిక వర్గం ఒక్కటిగా తెలుగుదేశం, జనసేనకు మద్దతుగా నిలవనున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *