12, జనవరి 2024, శుక్రవారం

అంగన్వాడీల పోరాటం ఆదర్శనీయం

 


తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం డిసెంబర్ 12 నుండి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె 32వ రోజు కొనసాగుతున్నది. చిత్తూరు జిల్లాలో 12 ప్రాజెక్టులు 2436 సెంటర్లు ఉన్నాయి. చట్టబద్ధంగా రాష్ట్రవ్యాప్తంగా 14 రోజులు ముందు సమ్మె నోటీసు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లాలో కూడా సమ్మెలో అంగన్వాడీలు దిగారు. అయితే సమ్మె ప్రారంభమైన మొదటి రోజే సమ్మె చేయవద్దని ఐసిడిఎస్ అధికారులు కార్మికులకు నోటీసులు పంపారు. వెనక్కు తగ్గని అంగన్వాడీలు సమ్మె కొనసాగించారు. నాలుగు రోజుల తర్వాత సెంటర్ తాళాలు పగలగొట్టి విధ్వంసకరమైన విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు.



 రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిత్తూరు జిల్లాలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అంగన్వాడి సెంటర్ల తాళాలు పగలగొట్టే పని చేయించారు. దొంగల అర్థరాత్రి గ్రామాల్లో ప్రజలు భయభ్రాంతులకు ఏ విధంగా తాళాలు పగలగొట్టారు. అంగన్వాడీల సేవలు పొందుతున్న తల్లులు ప్రజలు సెంటర్లు బాడుగులకు ఇచ్చిన ఇంటి యజమానులు ఈ దుర్మార్గంగాన్ని ప్రతిఘడించడంతో అలాంటి ఆదేశాలు మేము ఇవ్వలేదని ప్రభుత్వ పెద్దలు బుకాయించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్సా సత్యనారాయణ మేము తాళాలు పగలగొట్టమని చెప్పలేదని ప్రకటించాల్సి వచ్చింది. సచివాలయ సిబ్బంది ద్వారా సెంటర్ నడపాలని చూస్తూ, చర్చలు పేరుతో దౌర్జన్యాలు దిగుతున్నారు. మీ కష్టం గొప్పదంటూనే వేతనాలు తప్ప మిగిలిన వాటిని మాట్లాడుకుందామని చర్చలకు మోకాలు అడ్డు వేశారు. 


తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్న ముఖ్యమంత్రి హామీ గురించి మాట్లాడం లేదు. సమ్మె చేస్తుంటే వేతనాల తప్ప అంటే చర్చలకు అర్థం ఏముంది. ముఖ్యమంత్రి స్పందించడం లేదు. కాబట్టి మంత్రులు ఎమ్మెల్యేలకు చెప్పుకుందామని వాళ్ళు ఇల్లు దగ్గరికి వెళ్తుంటే పోలీసులు ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. జిల్లాలో అన్నిచోట్ల ఎమ్మెల్యేలు  ఇంటి వద్ద ఆందోళన కార్యక్రమాలు చేసిన పరిస్థితి ఉంది. మహిళలను అడ్డుకుంటే జరిగే పరిణామాలు ఊహించి వెనక్కు తగ్గారు. సమ్మె శిబిరాల దగ్గర పోలీసులు మోహరించి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. జనవరి 5 లోపు వీధుల్లో చేరకపోతే తొలగిస్తామని అని హెచ్చరించారు. అధికారులు ప్రతిరోజు మెసేజ్ ల ద్వారా భయపెడుతూనే ఉన్నారు. 


చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా భయాందోళన గురిచేస్తున్నారు. గతంలో టిడిపి వారు గుర్రాలతో తొక్కించారు, మేము అలా చేశామా అంటూ ప్రభుత్వ సలహాదారులు రాగాల్పన చేయడం మరింత విడ్డూరంగా ఉంది. ఈ సమ్మె వెనుక జాతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయని, కమ్యూనిస్టులు ఉన్నారని, ఎవరో డబ్బులు ఇచ్చి సమ్మెను నడుపుతున్నారని దుష్ప్రచారం మొదలు పెట్టారు. ప్రతి ఉద్యమ సమయంలోను ప్రతి సమ్మెలోను జరిగే తంతే ఇది. అధికారంలో ఎవరు ఉన్న ఇవే పదాలను పదేపదే వల్లించడం చూసి జనం విసుగుపోయారు. వాటిని పాలకులు వాడేస్తున్నారు. సమ్మెను అణిచి వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎస్మాను ప్రయోగించింది. సోకాజ్ లు ఇచ్చి పది రోజుల్లో  ఇచ్చి విధుల నుండి తొలగిస్తామని హెచ్చరించింది. 


వరకు అంగన్వాడీలకే పరిమితమైన ఈ  అణచివేత చర్యలు ఆంధ్ర రాష్ట్ర కార్మిక ఉద్యోగ వర్గాల ఉద్యమాలకు సవాల్ గా మారి ఈ నిరంకుశ చర్యలను ప్రతిఘటించారు. అంగన్వాడీలకే కాదు, ఆంధ్ర రాష్ట్ర శ్రమజీవులు ఉద్యమాలకు జీవన్మరణ సమస్య. నియంతృత్వానికి నిరసన నిదర్శనగా ఉన్న క్రూరమైన ఎస్మా చట్టాన్ని గౌరవ వేతనంతో బతికే అంగన్వాడీల మీద ప్రయోగించారంటే రానున్న రోజుల్లో ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కుల గురించి వేతనాలు గురించి ఉద్యమించగలరా ?


అంగన్వాడి పోరాటాల గురించి అధికార పార్టీ ఎమ్మెల్యేలు రకరకాల పద్ధతుల్లో దుర్భసలాడుతూ దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు వారు అనుచరులు తమ స్థాయి దిగజార్చుకొని మాట్లాడుతున్నారు. ఇలాంటి విమర్శలు వెనుక కార్మికుల చైతన్యాన్ని గుర్తించి సహకరించడం లేదు. ఉద్యమాలకు అండగా నిలిచే కమ్యూనిస్టు పార్టీలను కార్మికుల నుండి దూరం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన నిర్బంధాలను నిందారోపణలను అంగన్వాడీలో ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు సమ్మె శిబిరానికి వచ్చి ఆర్థిక సహాయం చేస్తామంటే  అంగన్వాడీల నిరాకరించారు.     


 అంగన్వాడీలకు అండగా....

 గౌరవ వేతనంతో పనిచేస్తున్న అంగనవాడిల మీద అందులో మహిళలు మీద నిర్బంధాన్ని అమలు చేస్తూ, నిందారోపణలు చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇతర రంగాల్లోని అసంఘటితరంగా కార్మికుల చేసే ఉద్యమాలు మీద ఎంతటి ఉక్కు పాదం మోపుతారో ఊహించవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న సమ్మె అంగన్వాడీలదే కావచ్చు. కానీ ఆ సమ్మెను అణచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు భవిష్యత్తు ఉద్యమాలకు ప్రమాదకరం. అంగన్వాడీల సమ్మెకు అండగా నిలవడం కేవలం అంగన్వాడీల వేతనాలు పెంపుదలకే కాదు, రాబోయే ఉద్యమాలను కాపాడడం కోసం, కార్మిక హక్కులను ప్రభుత్వాలు నివారించుకోవడానికి అత్యవసరం. నెలరోజులు దాటుతున్నా, పట్టుదలగా పోరాడుతున్న అక్కచెల్లెళ్లతో పట్టుదల పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇప్పుడు వారికి తోటి కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజలు, నాయకులు మద్దతే కాదు సంఘాల నుంచి మద్దతు ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా ఆర్థికంగా సహకరించి అండగా నిలబడే సంఘీభావ కావాలి. ఈ ఉద్యమం జయప్రదమైతే అంగన్వాడీలకు కొంత ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. ప్రభుత్వం జయప్రదమైతే మొత్తం కార్మిక ఉద్యోగులకు అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. అంగన్వాడీలు చేస్తున్న సమ్మె సందర్భంగా అనేక సంఘటన జరిగాయి. ఇప్పటికే చాలామంది చనిపోయిన పరిస్థితి ఉంది.   


  
కమ్యూనిస్టులపై అక్కసు ఎందుకు ?  

ఉద్యమిస్తున్న వారికి అండగా నిలిచే కమ్యూనిస్టులపై అక్కసు వెళ్ళగక్కడం పాలకులకు కొత్తమి కాదు. ప్రతి సందర్భంలోనూ కార్మిక ప్రజా పోరాటాల్లో ప్రతిపక్షంగా ఉన్నపుడు మద్దతు ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాలను అణచివేయడం, కమ్యూనిస్టులపై పాలకుల అనైతిక విధానం. కమ్యూనిస్టులు అంటే పాలకులకు భయం. ఢిల్లీలో జరిగిన రైతు పోరాటమైన, గల్లీలో జరిగే అంగన్వాడీల సమ్మె ఉద్యమించే వారి పక్షాన నిలవడం కమ్యూనిస్టులకు ప్రజాతంత్ర వాదులు బాధ్యత అని అందరూ అనుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలకు ఊపిరిలోడుతున్న అంగన్వాడీల సమ్మె చారిత్రాత్మకం. సువర్ణాక్షరం. 32 రోజులుగా లక్షా పదివేలమంది మహిళలు పట్టు సడలకుండా జగమొండి ప్రభుత్వంపై పోరాడుతున్నారు. ఎస్మా లాంటి పాశవిక చట్టాలను అడ్డుపెట్టి ఈ ఉద్యమ క్రాంతిని ఆపాలను చూస్తున్న పాలకులకు స్వప్నంలో కూడా వీడని కాళీకలు అయ్యారు. అంగన్వాడీల వేతనాల కోసం, చట్టపద్ధ సౌకర్యాలు కోసం పోరాడుతున్న అతి బక్క జీవుల మీద బ్రహ్మాస్త్రం ప్రకటించిన ప్రభుత్వం, అది తనకు బస్మాసురస్రతం అవుతుందని గుర్తించేలా చేయడం నేటి చారిత్రక అవసరం. చిత్తూరు జిల్లాలోని అంగన్వాడీలు కూడా అధికారుల తీరును తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం నోటితో చెప్తే కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. కొంతమంది అధికారులు, జిల్లా పిడి అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తూ అంగనవాడిలపై ఒత్తిడికి పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు మద్దతును చూసి అంగన్వాడి సమస్యలను పరిష్కారం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.  

వ్యాసకర్త              
వాడ గంగరాజు, గౌరవ అధ్యక్షుడు,   
ఏపి అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు). 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *