నగరిలో పోటీకి సై అంటున్న హర్షవర్ధన్
అయన ఐఐఎం అహ్మదాబాద్ లో చదివారు. 6 క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదిగారు. ఒకేసారి 3 పిజీ లు పాసయ్యారు. 15 దేశాలలో పర్యటించారు. జాతీయ క్రీడాకారుడు, విద్యావంతుడు, అధ్యాపకుడు, సామాజిక వేత్త, సైకాలజిస్ట్, శిక్షకుడు, పరిశోధకుడు, సంఘసేవకుడు... ఇలా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అయిన 34 ఏళ్ళ యువకుడు. ఎన్నో రికార్డులు సృష్టించారు. మరెన్నో అవార్డులు అందుకున్నారు. తిరుపతి ఐఐటిలో అంతర్జాతీయ అధికారిగా ఉద్యోగం చేశారు. వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పిహెచ్ డి చేస్తున్నారు. వీటితో సంతృప్తి పొందని అయన తండ్రి బాటలో రాజకీయ రంగంలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. పాతికేళ్ల వయసులో తన తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన చోట తాను పోటీ చేసి గెలవాలని దృడ నిర్చయంతో ఉన్నారు. తండ్రిని మించిన తనయుడిగా పేరు పొందాలని అకాంక్షిస్తున్నారు. డి అంటూ కొడితే దిగ్గజన్నే డికోనాలి. ఏదైనా సవాల్ గా తీసుకోవాలి. గెలువాలి.. గెలిచి చూపించాలి.. అందుకే, మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజాతో పోటీ చేయడానికి సై అంటున్నారు. చంద్రబాబు అనుమతిస్తే, నగరి నుండి పోటికి సిద్దం అంటున్నారు. మూడు నెలల క్రితమే నారా లోకేష్ ను కలసి తన ఆకాంక్షను తెలిపారు. ఆయన పేరు ఎన్ బి హర్షవర్ధన్ రెడ్డి. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ఏకైక కుమారుడు.
చదువులో మేటి
ఆయన ఒకటి నుంచి ఐదు వరకు తిరుపతిలో చిన్న కాన్వెంట్లలో, ఆరు నుంచి 10 వరకు తమ స్వంత పాటశాలలో చదివారు. ఇంటర్ ఎస్వీ జూనియర్ కాలేజి, బి ఎ ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో బిఏ చదివారు. దీనితో పాటు భారతీయార్ యూనివర్సిటీలో దూరవిద్య ద్వారా బి ఎస్సీ కమ్యూటర్స్ చేశారు. తరువాత రెగ్యులర్ గా ఎంబీఏ చదువుతూ దూర విద్య ద్వారా ఒకేసారి ఎం ఎస్ డబ్ల్యు, ఎం ఎస్ సైకో థెరపీ చేశారు. తరువాత శ్రీకాళహస్తి మార్గంలో ఉన్న శ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంబీఏ అధ్యాపకునిగా, విభాగ అధిపతి గా పనిచేశారు. అదే సమయంలో ఐఐఎం అహ్మదాబాద్ లో ఫ్యాకల్టీ డెవలప్ మెంట్ కోర్స్ చేశారు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పార్ట్ టైం పిహెచ్ డిలో చేరి కొనసాగిస్తున్నారు. అదే సమయంలో ఏర్పేడు వద్ద ఉన్న ఐఐటిలో ఇంటర్ నేషనల్ అధికారిగా చేరారు. రెండు నెలలకు ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి సేవాకార్యక్రమాలకు పూర్తి సమయం కేటాయిస్తున్నారు. అవకాశం వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తున్నారు.
సేవల్లో ఘనుడు
ఆయన ఇటీవల జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ (జె సి ఐ) ఇండియా జాతీయ ఉపాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. డిసెంబర్ 27 నుంచి 31 వ తేదీ బెంగుళూరు హిల్టన్ హోటల్లో జరిగిన జాతీయ సదస్సులో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017లో జూనియర్ జేసీఎస్ అధ్యక్షునిగా, 2018లో జె సి ఐ తిరుపతి శాఖ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2019లో జోన్ ఉపాధ్యక్షుడు, ఆసియా పసిఫిక్ డెవలెప్మెంట్ కౌన్సిల్ అధికారిగా ఉన్నారు. 2020లో జోన్ డైరెక్టర్, ఎపిడిసి అధికారిగా ఉన్నారు. 2021లో జోన్ అధ్యక్షుడుగా సేవలు అందించారు.2022 లో జె సి ఐ జాతీయ ఫౌండేషన్ సభ్యుడు 2023 లో జాతీయ డైరెక్టర్ అయ్యారు. 2024 సంవత్సరానికి జాతీయ ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.గత మూడేళ్లలో నెస్లే సంస్థ సహకారంతో ఎపి, తెలంగాణ రాష్ట్రాలలో కోటి రూపాయలకు పైగా విలువైన నిత్యావసర వస్తువులను పేదలకు పంపిణీ చేశారు. రాయలసీమ నుంచి జె సి ఐ ఉపాధ్యక్షుడు అయిన మొదటి వ్యక్తి, రాష్ట్రం నుంచి ఎన్నికైన రెండవ వ్యక్తి కావడం విశేషం.
క్రీడల్లో రాణింపు
నాలుగవ తరగతి చదివే వయసులో 10 ఏళ్ళ వయో గ్రూపు టెక్వాండో పోటీల్లో రాష్ట్ర చాంపియన్ అయ్యారు. తరువాత జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఐదవ తరగతిలో జాతీయ స్థాయి అండర్ 10 జాతీయ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నారు. తరువాత పలుసార్లు రాష్ట్ర, జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలో పాల్గొన్నారు. ఆరవ తరగతి నుంచి ఎంబీఏ వరకు 12 ఏళ్ళు ఆయా వయో గ్రూపుల్లో టెన్నిస్ కెప్టెన్ గా ఉన్నారు. ఇందులో మూడేళ్లు ఎస్వీ యూనివర్సిటీకి రెండేళ్లు జేఎన్టీయూసికి ఆడారు.అలాగే రోలర్ స్కేటింగ్ లో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించారు. స్కేటింగ్ హాకీ లో రాష్ట్ర జట్టుకు కెప్టెన్ గా చేశారు. స్కేట్ బాల్ లో జాతీయ పోటీలో పాల్గొన్నారు. స్విమ్మింగ్, హార్స్ రైడింగ్ లో అనుభవం గడించారు. ఎన్సీసీ లో సి సర్టిఫికేట్ సాధించారు.
అవార్డుల్లో అగ్రగణ్యుడు
వివిధ రంగాలలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా తొమ్మిది అవార్డులు పొందారు. 2002లో క్రీడల్లో ప్రతిభా అవార్డు, 2009 లో ఇందిరా ప్రియదర్శిని అవార్డు 2010లో మదర్ థెరిస్సా అవార్డు వచ్చాయి. 2013లో ఆల్ ఇండియా బెస్ట్ రీసెర్చ్ పేపర్ అవార్డు, 2016లో ఐ ఎస్ టి డి జాతీయ ట్రైనర్ అవార్డు, 2018లో ఎంటిసి గ్లోబల్ డిస్టింగ్గ్విస్డ్ టీచర్ అవార్డ్, 2019 లో గ్లోబల్ ఎక్స్లెన్స్ అవార్డు, 2020 లో ఉత్తమ శిక్షకుడు అవార్డు వచ్చింది. 2023 లో విశిష్ట సేవా శిరోమణి పురస్కారం లభించింది.
ఇతర బాధ్యతలు
నాలుగేళ్లు జీవనవికాసం మాసపత్రిక ఎడిటర్ గా ఉన్నారు. రాష్ట్ర విద్యార్థి వికాస వేదిక అధ్యక్షునిగా ఉన్నారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా తిరుపతి చాప్టర్ కార్యదర్శిగా ఉన్నారు,ప్రస్తుతం జాతీయ మండలి సభ్యునిగా ఉన్నారు. జపాన్, చైనా తదితర15 దేశాల్లో పర్యటించారు. పలు రీసెర్చ్ పేపర్లు సమర్పించారు. లక్ష మందికి పైగా విద్యార్థులు, యువకులకు శిక్షణ ఇచ్చారు. ఏడు విదేశీ సంస్థల్లో జీవిత కాల సభ్యునిగా ఉన్నారు. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, ఐఏఎస్ అధికారులు, వైస్ ఛాన్సలర్లతో వేదిక పంచుకున్నారు.