రణరంగంగా మారిన అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడి
పోలీసుల వలయాలను తోచుకొని ముందుకు వెళ్ళిన అంగన్వాడీలు
వాడ గంగరాజు తో పాటు పలువురికి గాయాలు
సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాడాలి
సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహ రావు పిలుపు
అంగన్వాడీల ముట్టడితో కలెక్టరేట్ దద్దరిల్లింది. పోలీసులు కలెక్టరేట్ల పోనీకుండా భారీక్యాట్లు పెట్టినా, వాటిని తోసుకుంటూ అంగన్వాడీలు ముందుకు వెళ్లారు. పోలీసులకు అంగన్వాడీలకు మధ్య యుద్ధ వాతావరణం లాగా తోపులాటలు జరిగాయి. తోపులాటలో ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవాధ్యక్షుడు వాడ గంగరాజుకు గాయం అయ్యింది. ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరాకపోతే పోరాటనే ఉద్రితం చేస్తామని హెచ్చరించారు.
.
రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాట్యూటి చెల్లించాలని 23 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె బుధవారం కలెక్టరేట్ వద్ద భారీ ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ ముట్టడి కార్యక్రమానికి రాత్రి నుంచి పోలీసులు రకరకాల పద్ధతుల్లో అరెస్టులు గృహ నిర్బంధాలు చేసినా వేలాది మందిలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ఏపీ అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లలిత అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఆర్ వి నరసింహారావు మాట్లాడుతూ గత 23 రోజులుగా అంగన్వాడీల సమ్మె కొనసాగిస్తుంటే ప్రభుత్వం రకరకాల పద్ధతిలో నిర్బంధాలు గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నది. గడిచిన 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అంగన్వాడి ఉద్యోగులకు వేతనం తెలంగాణ కంటే వెయ్యి రూపాయల అదనంగా ఇస్తానని వాగ్దానం చేశారు. మాట తప్పును మడమతిప్పును అని చెప్పే సీఎం మాట నిలబెట్టుకోవాలంటే అంగన్వాడీలకు వేతనాల పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు గ్రాట్యూటీ చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ చర్చలలో మళ్ళీ కోర్టుకు వెళ్ళండి అని చెప్పడం దుర్మార్గమన్నారు. తీర్పును అమలు చేయకుండా దాటవేయడం ఏమిటని ప్రశ్నించారు.
అంగన్వాడీలు కోర్కెలు కోరడం లేదని వాళ్ళు న్యాయమైన సమస్యలను పరిష్కారం చేసే దిశగా ఇప్పటికైనా ప్రభుత్వం దిగరావాలని డిమాండ్ చేశారు. ముగ్గురు మంత్రులు సమ్మెను విచ్చినం చేయడానికి రకరకాల పద్ధతుల్లో భయపెట్టడం భయాందోళన గురిచేయడం సచివాలయ ఉద్యోగులు అంగన్వాడి కేంద్రాల తాళాలు పగలగొట్టి చట్ట విరుద్ధంగా స్వాధీనం చేసుకోవడం లాంటి వాటితో బెదిరించిన సమ్మె కొనసాగిస్తున్నారు మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు బాధితరహితంగా అంగన్వాడీలపై అవమానకరంగా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించి దిశగా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు ఉదయం 8 గంటల నుండి మహిళలు కలెక్టరేట్ చేరుకొని ముట్టాడని కొనసాగించారు.
పోలీసులు భారీ స్థాయిలో మొహరించిన అనేక అడ్డంకులు పెట్టి అడ్డుకున్న అంగన్వాడీలు ముట్టడి కొనసాగించారు జగన్ పై పాటలు పాడుతూ వచ్చిన మహిళలకు ఒకేసారి నింపారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి వి ఆర్ జ్యోతి ఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవాధ్యక్షుడు గంగరాజు జిల్లా నాయకులు గిరిధర్ గుప్తా ఓబుల్ రాజు భువనేశ్వరి ఈశ్వరయ్య ఏఐటియుసి అంగన్వాడిని నాయకురాలు ప్రభావతి నగర కార్యదర్శి చంద్ర నాయకులు రమాదేవి లతోపాటు అంగన్వాడిని సిఐటియు అంగన్వాడి జిల్లా కార్యదర్శి షకీలా నాయకులు మమత శ్యామల సరళ పుణ్యవతి పంచవర్ణ అనిత శ్యామల భారతి లతో వేలాదిమంది అంగన్వాడీలు పాల్గొన్నారు.