అంగన్వాడీల సమ్మె 27వ రోజుకు చేరింది. ఆదివారం చిత్తూరు కలెక్టరేట్ వద్ద రెండవ రోజు రిలే దీక్షలు ఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వం దుర్మార్గంగా ప్రయోగించిన ప్రభుత్వం దుర్మార్గంగా ప్రయోగించిన వెస్మ జీవో 2 కాపీలను దగ్దం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడో లేనివిధంగా అంగన్వాడీల ఉద్యమంపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమన్నారు. ఆగ మేఘాల మీద జీవో నెంబర్ 2 తీసుకువచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయోగిస్తుండడం దుర్మార్గమన్నారు. ఇలాంటి బెదిరింపులకు అంగన్వాడి ఉద్యమం చాలా చూసిందని ఎస్మా లాంటివి ఎన్ని చట్టాలు తెచ్చిన ఉద్యమ ఆగదని సమస్యలు పరిష్కారం చేస్తేనే ఉద్యమం ఆగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రయోగాలు చేయడం మానేసి సమస్యలను పరిష్కారం చేసే దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ఏపీ అంగన్వాడి వర్కర్స్ యూనియన్ షకీలా, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్, సిఐటియు జిల్లా కార్యదర్శి కే సురేంద్రన్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు రమాదేవిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడి వాళ్లతో పాటు మున్సిపాలిటీ, ఎస్ఎస్ఏ కార్మికులందరూ సమ్మె బాట పట్టారు.ఎన్నికలు దగ్గర్లో ఉన్న బెదిరింపులు పాల్పడుతున్నది. ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే పనులు అంగన్వాడీలు ఉంటారని హెచ్చరించారు. నాయకురాలు ప్రభా తదితరుల పాటు బంగారుపాళ్యెం, ఐరాల ప్రాజెక్ట్ నాయకులు పాల్గొన్నారు.