8, జనవరి 2024, సోమవారం

పెనుమూరులో ఉద్రిక్త వాతావరణం

భారీగా పోలీసు బలగాల మోహరింపు
రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద పహారా
ఇరువర్గాలకు మైక్ అనుమతి నిరాకరణ
పులిగుండు వద్ద జ్ఞేనేంద్ర రెడ్డి వర్గం మోహరింపు


గంగాధర నెల్లూరు వైసిపి గ్రూపు రాజకీయాలు సోమవారం మరోసారి వేడెక్కాయి. తీవ్ర ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. సోమవారం పెనుమూరు వైయస్ఆర్ విగ్రహం వద్ద రెండు వర్గాలు తలపడటానికి సిద్దం అయ్యాయి.ఈ విషయాన్ని పోలీసులు ముందుగానే పసిగట్టారు. ఇరు వర్గాలకూ అనుమతిని నిరాకరించారు. వైస్సార్ విగ్రహం వద్దకు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. భారీగా పోలీసుల బలగాలను మోహరించారు. సిఐ కూడా అక్కడే మకాం వేశారు. దీంతో పెనుమూరులో భారీ ప్రమాదం తప్పింది.అయినా పెనుమూరులో ఉద్రిక్త వాతావరణం కోనసాగుతోంది. పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఎవరూ రాకుండా జాగర్తలు తీసుకుంటున్నారు.


 ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర  పెనుమూరు  విచ్చేసి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి నారాయణ స్వామి వర్గం కార్యక్రమాన్ని తలపెట్టింది.  పెనుమూరు తాహసిల్దార్ కార్యాలయం వద్ద ఉన్న వై ఎస్ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని భావించారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం  చేయాలని నిర్ణయించారు. పెనుమూరు మండలం నుంచి ప్రజాప్రతినిధులు, సచివాలయం కన్వీనర్ లు, గృహ సారధులు, సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు కామసాని విజయ్ కుమార్ రెడ్డి, పెనుమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ బండి కమలాకర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు నవీన్ కుమార్ రెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. తొమ్మిది గంటలకు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అయితే ఆ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 12 వరకు జరపడానికి నిర్ణయించుకున్నారు.

 
అయితే ప్రభుత్వ సలహాదారు ఎం జ్ఞానేంద్ర రెడ్డి వర్గం కూడా ఉదయం  11 గంటలకు అక్కడే వేరుగా కార్యక్రమం నిర్వహించ డానికి నిర్ణయించుకున్నారు. వీరి వెనక టికెట్టు ఆశావహుడు రాజేష్ కూడా ఉన్నట్టు తెలిసింది. ఎంపిపి హేమలత, జెడ్పీటీసీ దొరస్వామి యాదవ్, మాజీ మండల కన్వీనర్ సురేష్ రెడ్డి ఈ వర్గానికి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రకటించారు. అమెరికా నుంచి వచ్చిన జ్ఞానేంద్ర రెడ్డి కూడా పెనుమూరులో ఉంటారని తెలిసింది. ఈ వర్గం నారాయణ స్వామికి టికెట్టు ఇవ్వకూడదని పోరాడుతున్న విషయం అందరికి తెలిసిందే. 


ఈ నేపథ్యంలో రెండు వర్గాలు వేరువేరుగా మైక్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య నినాదాలు, నిరసనలు వెల్లువెత్తాయని పోలీసులు ఊహించారు. శ్రుతి మించితే అల్లర్లు, దాడులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని భావించారు. తొలుత పోలీసులు స్వామి వర్గానికే అనుమతి ఇచ్చారని తెలిసింది. జ్ఞానేంద్ర వర్గానికి అనుమతి నిరాకరిస్తే ధర్నాలు రాస్తారోకోలు చేపడతారు. రెండు వర్గాలు ఒకేసారి ఎదురుపడితే గొడవలు జరిగే అవకాశం ఉందంటున్నారు. దీనితో పోలీసులు నారాయణ స్వామి వర్గానికి ఇచ్చిన మైక్ అనుమతిని రద్దు చేసి అప్రమత్తం అయ్యారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్దకు ఎవరినీ రానివ్వలేదు. దీంతో  జ్ఞేనేంద్ర రెడ్డి వర్గం పులిగుండు వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో నారాయణ స్వామికి టిక్కెట్టు ఇవ్వకూడదని డిమాండ్ చేశారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *